Jagan Comments Chandrababu: రాజకీయాల్లో సిద్ధాంతపరంగా విమర్శలు చేయాలే కానీ.. వ్యక్తిగత అంశాల జోలికి పోకూడదు. రాజకీయ ప్రత్యర్థులతో రాజకీయ పోరాటం చేయాలి. కానీ వారి వ్యక్తిగత హాని కోరుకోకూడదు. బహుశా ఏపీలో ఈ పరిస్థితి లేదు. ఇక్కడ వ్యక్తిగత విమర్శలకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. చివరకు వయస్సు, ఆరోగ్యం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. గత వైసిపి( YSR Congress ) హయాంలో ఎక్కువగా ఈ పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు వ్యక్తిగత విమర్శల పర్వం తగ్గింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం అదే తరహా కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి సైతం ఇటువంటి సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అంటూ శాపనార్థాలు పెట్టారు. ప్రస్తుతం జగన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: ఏపీలో నామినేటెడ్ జాతర!
జగన్ ఘాటు స్పందన..
పులివెందుల( pulivendula) జడ్పిటిసి ఉప ఎన్నిక నిన్న జరిగిన సంగతి తెలిసిందే. అయితే అధికార పార్టీ అరాచకాలు సృష్టించి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి గెలవాలని ప్రయత్నించిందని వైసిపి ఆరోపిస్తోంది. అదే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా.. పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారని టిడిపి చెబుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరిన విధంగా ఎలక్షన్ కమిషన్ రెండు పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు రీ పోలింగ్ కు అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ పోలింగ్ జరుగుతోంది. కానీ రీ పోలింగ్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రజాస్వామ్యం ఖూనీ
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం( democracy) లేదనడానికి నిన్న పులివెందులలో జరిగిన ఎన్నికల నిదర్శనమని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ ఏజెంట్లను లేకుండా ఎన్నికలను రిగ్గింగ్ చేశారని చెప్పుకొచ్చారు. పోలీసులే ఏజెంట్ల ఫామ్ లు చింపేసిన పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని చెప్పుకొచ్చారు. టిడిపి మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావుకు సమీప బంధువైన డిఐజి కోయా ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా వ్యవహరించారని మండిపడ్డారు జగన్. చంద్రబాబుకు చివరి ఎన్నికలు అని.. ఆయన వయసు కూడా అయిపోతుందని.. ఇలాంటి పనులు చేస్తే నరకానికి పోతారు అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని జగన్ చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించారు. నిన్న ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ లో తలెత్తిన అంశాలతో కూడిన వీడియోలను కూడా ప్రదర్శించారు.
Also Read: హిందూపురానికి నందమూరి బాలకృష్ణ గుడ్ బై!
ఎవరి వాదన వారిది..
ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు గెలుస్తారన్న సమాచారం నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) ఫ్రస్టేషన్ కు గురయ్యారని టిడిపి కూటమి నేతలు చెబుతున్నారు. అయితే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి.. రాజకీయ ప్రత్యర్థి చావును కోరుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అది ముమ్మాటికి తప్పిదం అని చెబుతున్నారు. కడపలో దశాబ్దాల తర్వాత స్వేచ్ఛగా ఓటు వేస్తే.. జీర్ణించుకోలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఆరోపిస్తున్నారు.