Dispute between AIADMK and BJP: తమిళనాడులో అన్నాడీఎంకే బీజేపీ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్లడం మనకు తెలిసిందే. అన్నాడీఎంకేకు ఈ పొత్తు అంతగా ఇష్టం లేదని మనకు తెలిసిందే. ఇంతవరకూ కూడా ఫళని స్వామి, అన్నామలై లు ఒకవేదికపైకి వచ్చి మాట్లాడిన సందర్భం లేదు.
ఇటీవల ఫళని స్వామి కోయంబత్తూరులో సభ పెడితే బీజేపీ నేతలు అందరూ వెళ్లారు. ఒక్క అన్నామలై తప్ప.. ఇప్పుడు కొత్తగా అంశం తెరమీదకు వచ్చింది. ఎన్నికల పొత్తు కుదిరిన తర్వాత అమిత్ షా ‘మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. మేం తమిళనాట గెలుస్తాం ’ అని చెప్పుకొచ్చారు.
దాన్ని డీఎంకే క్యాష్ చేసుకుంది. బీజేపీ తమిళనాడులో అధికారం చేజిక్కించుకోబోతోందని ప్రచారం చేసింది. ఎందుకంటే 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చాక ఇంతవరకూ డీఎంకే, అన్నాడీఎంకేలే తమిళనాడును పరిపాలించాయి. కానీ బీజేపీ అధికారంలోకి రాలేదు. పొత్తులు పెట్టుకొని ఇవే రెండు పార్టీలు గెలిచాయి.
అమిత్ షా ప్రకటనతో బీజేపీ అధికారంలోకి తమిళనాడులో వస్తుందని ప్రచారం చేశారు. దీని మీద ఫళనిస్వామి సంచలన ప్రకటన చేశారు. తమిళనాడులో పొత్తు ఉంటుంది కానీ ప్రభుత్వంలో అన్నాడీఎంకేనే ఉంటుందని ఫళని స్వామి ప్రకటించడం పెద్ద వివాదమైంది.
అన్నాడీఎంకే బీజేపీ మధ్య సంకీర్ణ ప్రభుత్వ వివాదంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.