Perni Nani : ఈ ఎన్నికలకు ముందు పుష్పం వాడుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ఫలితాలు వచ్చాక సైతం అదే ధోరణితో ముందుకెళ్లింది. అయితే తాజాగా పుష్ప సినిమాలో డైలాగ్ ‘రప్పా రప్పా’ ఎక్కువగా వాడేస్తోంది. వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలలో ఈ డైలాగ్ ఎక్కువగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న అధినేత జగన్మోహన్ రెడ్డి నోట కూడా ఇదే డైలాగ్ వినిపించింది. అయితే ఈ డైలాగ్ వైసీపీ నేతలకు పేటెంట్ లా ఉంది. తాజాగా మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని ఇదే డైలాగ్ తో అదరగొట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జరగబోయేది తేల్చి చెప్పారు.
Also Read : ఈవారం సందడి మొత్తం ఓటీటీలోనే.. ఏకంగా 16 సినిమాలు/సిరీస్లు, డిటైల్స్!
కృష్ణా జిల్లాలో విమర్శలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బాబు షూరిటీ మోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పాల్గొంటున్నారు పేర్ని నాని. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మంత్రి నారా లోకేష్ మాదిరిగా మీరు కూడా చెడిపోయారా? లోకేష్ రెడ్ బుక్ అంటే.. మీరు రఫ్పా రఫ్పా అంటున్నారు అని అన్నారు. ఏదైనా చేయాలంటే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలి తప్ప రప్పా రప్పా అని అనడం కాదన్నారు. అది చీకట్లోనే జరిగిపోవాలన్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నారు పేర్ని నాని. అంతేతప్ప పదే పదే రప్పా రప్పా అని వేలం వెర్రిగా మాట్లాడకూడదని కార్యకర్తలకు చెప్పారు. ప్రజల మనసుల్లో మన్ననలు పొందే విధంగా పనిచేయాలని… అలా మాట్లాడితే ప్రజలు మన్నించరు అన్నారు.
Also Read: బాహుబలి రీయూనియన్ కి అనుష్క డుమ్మా… ప్రభాస్, రాజమౌళీనే కారణమా?
పార్టీ శ్రేణులకు పరోక్షంగా..
అయితే పేర్ని నాని లాజికల్ గా మాట్లాడారు. లాజిక్కుగా వ్యాఖ్యానించారు. ఆ మాటలను తప్పుపడుతూనే.. చీకట్లో కన్ను కొడితే పని జరిగిపోవాలి అని వైసిపి శ్రేణులకు పరోక్షంగా హింట్ ఇచ్చారు. అంటే వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంతకు ఇంత ఉంటుందని ఆయన హెచ్చరికలు జారీ చేసినట్లు అయింది. వైసీపీలో దూకుడు కలిగిన నేతల్లో పేర్ని నాని ఒకరు. అయితే ఆయన మాట డిఫరెంట్ గా ఉంటుంది. మొన్న ఆ మధ్యన కేసుల భయంతో కాస్త వెనక్కి తగ్గారు. ఇప్పుడు మాత్రం రేచ్చిపోతున్నారు. ఈయన విషయంలో రెడ్ బుక్ ప్రవేశించాలని కూటమినేతలు కోరుతున్నారు. మరోవైపు ఈయన కుమారుడు పేర్ని కిట్టు కూడా కూటమి ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాకు సైతం ఈయన టార్గెట్ అవుతూ వస్తున్నారు.