Homeసినిమా వార్తలుఅలియా య‌వ్వ‌న‌పు తొలిరోజుల్లో.. హైస్కూల్ ప్రేమ !

అలియా య‌వ్వ‌న‌పు తొలిరోజుల్లో.. హైస్కూల్ ప్రేమ !

ప్రతి అమ్మాయికి తన య‌వ్వ‌న‌పు తొలిరోజులు జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి. తెలిసి తెలియని వయసులో చేసే చిన్న చిన్న చిలిపి పనులు మధురమైన జ్ఞాపకాలుగా జీవితాంతం గుర్తుండిపోతాయి. అందుకే, ప్ర‌తి ఒక్క‌ అమ్మాయి జీవితంలో యవ్వనం అనేది ఎంతో విలువైన‌ది. అయితే సాధారణ అమ్మాయిల విషయంలోనే యవ్వనం అంత విలువైనది అయినప్పుడు… మరి అందగత్తెలు, మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇక యవ్వనం ఎంత ప్రాధాన్యతతో కూడుకుని ఉంటుంది. అసలుకే అందాల భామలు.. నటన ఎలాగూ ఉంటుందయ్యే.. […]

Alia
ప్రతి అమ్మాయికి తన య‌వ్వ‌న‌పు తొలిరోజులు జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి. తెలిసి తెలియని వయసులో చేసే చిన్న చిన్న చిలిపి పనులు మధురమైన జ్ఞాపకాలుగా జీవితాంతం గుర్తుండిపోతాయి. అందుకే, ప్ర‌తి ఒక్క‌ అమ్మాయి జీవితంలో యవ్వనం అనేది ఎంతో విలువైన‌ది. అయితే సాధారణ అమ్మాయిల విషయంలోనే యవ్వనం అంత విలువైనది అయినప్పుడు… మరి అందగత్తెలు, మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇక యవ్వనం ఎంత ప్రాధాన్యతతో కూడుకుని ఉంటుంది.

అసలుకే అందాల భామలు.. నటన ఎలాగూ ఉంటుందయ్యే.. ఆ నటనలో భాగంగా హస్కీ ఎక్స్ ప్రెషన్స్, మత్తెక్కించే చూపులు ఇక కుర్రాళ్లను ఎంతలా ఉక్కిరిబిక్కిరి చేసి ఉంటాయి. ఒక్కో ముద్దుగుమ్మ వెనుకాల పదుల సంఖ్యలో కుర్రాళ్ళు తిరిగి తిరిగి తమ టీనేజీని అంతా హీరోయిన్ల యవ్వనం వైపే వృధా చేసుకుని ఉండి ఉంటారు. స్టార్ హీరోయిన్ అలియా భట్ ఓ ఇంటర్వ్యూలో త‌న య‌వ్వ‌న‌పు రోజుల్ని గుర్తు చేసుకుంటూ త‌న్మ‌యానికి లోన‌నైంది.

ఆ రోజుల్లో అంటూ తన ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లి కట్ చేస్తూ సింపుల్ గా తన యవ్వనంలోని తొలిరోజుల గురించి చెప్పుకుని తెగ మురిసిపోయింది. మెయిన్ గా హైస్కూల్‌ రోజుల్లోని ప్రేమలు చాల సరదాగా ఉంటాయని, ఆ ప్రేమల్లో అమాయకత్వంతో పాటు తెలియని ఆశ కూడా ఉంటుందని.. ప్రతి ఒక్కరి జీవితంలో హైస్కూల్ ప్రేమ ఉంటుందని.. అలాగే తన జీవితంలో కొన్ని సరదా సంఘటనలు ఉన్నాయని చెప్పుకొచ్చింది.

ఇక ఈ బాలీవుడ్ బ్యూటీ సినిమా నిర్మాతగానూ మారడానికి రెడీ అవుతుంది. “ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్” పేరుతో తన నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించింది. ఇప్పటికే కొత్త కథలను కూడా విని రెండు కథలను ఫైనల్ చేసిందట. మొత్తానికి నిర్మాతగా కూడా అలియా తన భవిష్యత్తును బాగానే ప్లాన్ చేసుకుని ముందుకు పోతుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper