శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ లో నూతనంగా నిర్మిస్తున్న చిత్రం “చెప్పినా ఎవరూ నమ్మరు” పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుని లాక్డౌన్ తరువాత థియేటర్లలో ఈచిత్రాన్ని మొదటి చిత్రంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ లో భాగంగా మొదటి సారిగా నేటి యువతరం హీరోల్లో విజయపథంలో దూసుకెళ్తు ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విస్వక్ షేన్ “చెప్పినా ఎవరూ నమ్మరు” చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి… ఈ సినిమా మంచి విజయం సాధించి… అందరికి గుర్తింపు రావాలని చిత్ర యూనిట్ ను అభినందించారు.
Also Read: కలర్ ఫుల్ గా జరిగిన కలర్ ఫొటో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
చిత్ర నిర్మాత డాక్టర్ ఎం. మురళి శ్రీనివాసులు మాట్లాడుతూ… ” ముందుగా అడిగిన వెంటనే మా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించిన విష్వక్ సేన్ కి మా చిత్ర బృందం తరఫున ధన్యవాదాలు. ఆయనకు ఇప్పటికే యూత్ లో మంచి ఇమేజ్ ఉంది. భవిష్యత్ లో మంచి విజయాలు సాధించి మరింత మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా. మా సినిమా విషయానికొస్తే… దర్శకుడు కథ చెప్పగానే నచ్చి, ఎక్కడ సాంకేతిక విలువలు తగ్గకుండా చిత్రాన్ని రూపొందించడం జరిగింది. మన తెలుగు ప్రేక్షకులు ఒక సినిమాలో ఏం కోరుకుంటారో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో వుంటాయి. కామెడీ త్రిల్లర్ తో అందరిని కడుపుబ్బనవిస్తుంది అనడంలో ఎలాంటి సందేహంలేదు. ఈ చిత్రాన్ని మూవీ మ్యాక్స్ ద్వారా విడుదల చేస్తున్నాం. లాక్డౌన్ తరువాత విడుదల అవుతున్న మాచిత్రాన్ని ఆదరించి సినిమాను, బ్రతికించలాని ప్రేక్షక దేవుళ్ళను వేడుకుంటున్నా” అన్నారు.
Also Read: సంక్రాంతి కి సిద్దమవుతున్న రొమాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్..
ఈ చిత్రంలో హీరోగా నటిస్తూ… దర్శకత్వం వహిస్తున్న ఆర్యాన్ కృష్ణ మాట్లాడుతూ… “మా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను మా చిత్ర యూనిట్ అడిగిన వెంటనే విస్వక్ సేన్ గారు స్పందించి విడుదల చేయడం చాలా ఆనందం అనిపించింది. అందుకుగాను విస్వక్ సేన్ గారికి మా టీం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కామెడీ త్రిల్లర్ తో అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే మాచిత్రం అందరికి నచ్చుతుంది.అందరు మాచిత్రాన్ని ఆదరించాలని మీ యొక్క దీవెనలు మాకు వుండాలని ప్రేక్షకులను వేడుకుంటున్నా. నిర్మాత ఈ చిత్ర నిర్మాణానికి బాగా సహకరించారు. సినిమా బాగా వచ్చింది. ఈ చిత్రం విజయంతో భవిష్యత్తులో కూడా ఆయన మరిన్ని మంచి చిత్రాలు తీయాలని ఆకాంక్షిస్తున్న” అన్నారు.
తారాగణం:
ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ తదితరులు
సాంకేతిక విభాగం:
డైరెక్టర్: ఆర్యన్ కృష్ణ
నిర్మాత: ఎం. మురళి శ్రీనివాసులు
బ్యానర్: శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్
సినిమాటోగ్రఫీ: బురన్ షేక్, అఖిల్ వల్లూరి
సంగీతం: జగ్దీద్ వేముల(Jagdeedh vemula)
ఎడిటర్: అనకల లోకేష్
లిరిక్స్: భాస్కరభట్ల
రీ రికార్డింగ్: ప్రజావాల్ క్రిష్
పి. ఆర్. ఓ: మధు వి.ఆర్.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Cheppina evaru nammaru movie first look unveiled
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com