Vaishnavi Chaitanya: సినీ ఇండస్ట్రీ లో జీరో నుండి మొదలై తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని తెచ్చుకోవడం, వచ్చిన ఆ గుర్తింపు ని కాపాడుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ముందుకు వెళ్లడం అంత తేలికైన విషయం కాదు. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ, బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి, ఆ సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya). ‘బేబీ’ సినిమాతో ఈ అమ్మాయికి యూత్ ఆడియన్స్ లో ఏర్పడిన క్రేజ్ అంతా ఇంతా కాదు. చూసేందుకు చాలా చక్కగా అనిపించే తెలుగమ్మాయి, నటన కూడా చాలా బాగుంది, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు పోతే కచ్చితంగా వేరే లెవెల్ కి వెళ్తుందని అంతా అనుకున్నారు.
కానీ ఈ అమ్మాయి ఎంచుకుంటున్న స్క్రిప్ట్స్ చూస్తుంటే ఈమె కూడా ఇటీవలే వచ్చిన హీరోయిన్స్ లాగా కనుమరుగు అయిపొతుందెమో అని అనుకుంటున్నారు విశ్లేషకులు. సినీ ఇండస్ట్రీ లో సక్సెస్ కోసం ముఖం వాచిపోయేలా ఎదురు చూస్తున్న హీరోలు హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే వైష్ణవి చైతన్య కి సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం దొరకడమే కష్టం అనుకుంటే, ఏకంగా భారీ సక్సెస్ వచ్చింది. ఆ సక్సెస్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా స్క్రిప్టులు ఎంచుకోవాలి. కానీ వైష్ణవి చైతన్య తీరు చూస్తుంటే అలా అనిపించడం లేదు. చేతికి వచ్చిన సినిమాని చేసుకుంటూ వెళ్ళిపోదాం అనే పంధా లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. బేబీ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఈమె ‘లవ్ మీ ఈఫ్ యు డేర్’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా ఆడియన్స్ కి తెలియదు.
అంతటి ఘోరమైన డిజాస్టర్ సినిమా. భవిష్యత్తులో అయినా పెద్ద హిట్ కొడుతుందిలే అనుకుంటే, రీసెంట్ గానే ఆమె జాక్ సినిమాతో మన ముందుకొచ్చింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉంది అనేది కాసేపు పక్కన పెడితే, ఆమె పోషించిన పాత్ర పై సోషల్ మీడియా లో తీవ్రమైన ట్రోలింగ్స్ కనిపిస్తున్నాయి. ఇలా అయితే హీరోయిన్ గా మనుగడ సాగించడం చాలా కష్టం, మళ్ళీ షార్ట్ ఫిలిమ్స్ లోకి వెళ్లిపోండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వైష్ణవి చైతన్య సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ .లో ఒక సినిమా చేయబోతుంది. రీసెంట్ గానే ‘జాక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ మా తదుపరి సినిమాలో వైష్ణవి చైతన్య నటిస్తుంది. జాక్ లో ఆమె పద్దతి గా కనిపించి ఉండొచ్చు, కానీ మా సినిమాలో ఆమెతో కొత్త రకమైన బూతులు తిట్టించబోతున్నాము, చాలా చెడ్డగా చూపించబోతున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. నాగ వంశీ సక్సెస్ స్ట్రీక్ లో వైష్ణవి చైతన్య కూడా జాయిన్ అవుతుందో లేదో చూడాలి.