Tollywood Heroine : ఇప్పటివరకు ఈమె ఎనిమిది సినిమాలు చేస్తే అందులో కేవలం రెండు మాత్రమే హిట్ అయ్యాయి. కెరియర్ స్టార్టింగ్ నుంచి యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరికీ జోడిగా నటించి ఆకట్టుకుంది ఈ చిన్నది. టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ హీరోయిన్ల హవా నడుస్తుంది. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ అందరికీ అదృష్టం కలిసి రాదు అని చెప్పొచ్చు. కొంతమంది చేసిన ప్రతి సినిమాతో విజయం సాధిస్తే మరి కొంతమంది మాత్రం ఎన్ని సినిమాలు చేసినా కూడా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నారు. వరుసగా అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ వాళ్ల ఖాతాలో హిట్స్ మాత్రం పడడం లేదు. అలాంటి వారిలో ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఒకరు. ఈమె డాన్స్ అద్భుతంగా చేస్తుంది. తన గ్లామర్ తో అందరిని కట్టిపడేస్తుంది. నటనతో కూడా అందరిని ఆకట్టుకుంటుంది.కానీ ఈమెకు అనుకున్న సక్సెస్ మాత్రం రావడం లేదు. ఇప్పటివరకు ఈ హీరోయిన్ ఎనిమిది సినిమాలు చేస్తే అందులో కేవలం రెండు మాత్రమే విజయం సాధించాయి. అయినా కూడా ఈమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఫోటోలో కనిపిస్తున్న ఈ యంగ్ హీరోయిన్ కుర్రాళ్ళ ఫేవరెట్ హీరోయిన్.
Also Read : సందీప్ రెడ్డి వంగ తో డీల్ సెట్ చేస్తున్న బాలీవుడ్ బాద్షా.
ఎక్కడ చూసినా కూడా ఈమె ఫోటోలే కనిపిస్తున్నాయి. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు కూడా అందరికీ జోడిగా నటించి దూసుకుపోతుంది. ఈమె మరెవరో కాదు ప్రస్తుతం సెన్సేషన్ సృష్టిస్తున్న యంగ్ బ్యూటీ శ్రీ లీల. కన్నడ సినిమా ఇండస్ట్రీలో నుంచి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీల. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి సినిమాలో తన అందంతో, నటనతో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలను కూడా అందుకుంది.
ఈ సినిమా తర్వాత రవితేజ తో ధమాకా సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నా కూడా హిట్స్ మాత్రం రావడం లేదు. చాలా గ్యాప్ తర్వాత బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. లేటెస్ట్ గా ఈమె హీరో నితిన్ కు జోడిగా నటించిన రాబిన్ హుడ్ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. శ్రీ లీలకు హిట్స్ పడకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం శ్రీ లీల పవన్ కళ్యాణ్ కి జోడిగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
Also Read : ఇంటి నుంచే రూ.5 వేల పెట్టుబడితో ప్రతి నెల లక్షల ఆదాయం.. చాలా డిమాండ్ ఉన్న వ్యాపారం ఇదే..