Kriti Shetty : ‘ఉప్పెన’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో మన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి(Krithi Shetty), మొదటి సినిమాతోనే అశేష ప్రేక్షకాభిమానం ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈమెకు బాగా కనెక్ట్ అయ్యారు. మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో కృతిశెట్టి కి టాలీవుడ్ లో అవకాశాలు క్యూలు కట్టాయి. ఉప్పెన తర్వాత ఆమె చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ చిత్రాలు కమర్షియల్ గా పెద్ద అయ్యాయి. కానీ ఆ తర్వాత మాత్రం ఈమె చేసిన ప్రతీ సినిమా ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. పైగా టాలీవుడ్ లో శ్రీలీల మేనియా ఒక రేంజ్ లో మొదలు అవ్వడంతో కృతి శెట్టి కి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. కానీ తమిళ సినీ ఇండస్ట్రీ ఆమెకు రెడ్ కార్పెట్ వేసింది.
Also Raed : టాలీవుడ్ కి ‘గుడ్ బై’ చెప్పేసిన కృతి శెట్టి.. కనీసం అక్కడైనా కెరీర్ ఉంటుందా?
ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. అందులో రెండు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఈమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. కొంతమంది ఆ వీడియో లోని కొన్ని షాట్స్ ని ఉపయోగించి కృతి శెట్టి తన ప్రియుడిని అభిమానులకు పరిచయం చేసింది అంటూ ప్రచారం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) చేస్తున్న చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు, హీరోయిన్ నయనతార(Heroine Nayanthara) నిర్మాత, ఆమె భర్త సతీష్ విగ్నేష్ దర్శకత్వం వహించాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే ఈ విషయాన్నీ విన్నూతన రీతిలో తెలిపింది మూవీ టీం. హీరోయిన్ కృతి శెట్టి ఒంటరిగా ఒక పక్కన నిల్చున్న ప్రదీప్ రంగనాథన్ వద్దకు వెళ్తుంది. అతని వైపు ప్రేమగా చూడగా, అతను మాత్రం సీరియస్ గా చూస్తుంటాడు. అనంతరం అతను కూడా కృతి శెట్టి తో కలిసి మూవీ టీం వద్ద కూర్చొని గ్రూప్ ఫోటో దిగుతాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి ‘ధీమా ధీమా’ అనే పాట విడుదలై పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా ప్రదీప్ రంగనాథన్ మార్క్ లవ్ స్టోరీ గా అనిపిస్తుంది. రొటీన్ కి భిన్నంగా ఉండే కథలను మాత్రమే ప్రదీప్ ఎంచుకుంటూ వచ్చాడు, కాబట్టి ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నారు అభిమానులు. మరి అది ఎంత వరకు నిజమో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.
Also Read : భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీ లో ఛాన్స్ కొట్టేసిన కృతి శెట్టి..ఇక ఈమె తలరాత మారినట్టే!