Niti Taylor Photo
Tollywood : ఒకే ఒక సినిమాతో వాళ్లు ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయారు.మరికొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలతోనే ఫెడ్ అవుట్ అయ్యి సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయారు. ఈ జాబితాలో ఈ హీరోయిన్ కూడా ఒకరు. ఈ బ్యూటీ తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలు అయినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును మరియు ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో యూత్ సినిమాలు ఇప్పటివరకు చాలా అనే రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలలో మేం వయసుకు వచ్చాం సినిమా కూడా ఒకటి అని చెప్పొచ్చు. 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. త్రినాధరావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. తనీష్, నీతి టేలర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో కనిపించారు. అప్పట్లో రిలీజ్ అయిన ఈ సినిమా ముఖ్యంగా యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో తనీష్ తన నటనతో మంచి ప్రశంసలు అందుకున్నాడు. అందమైన ప్రేమ కథ చిత్రం గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా నీతి టేలర్ తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత ఆమె మరొక సినిమాలో కనిపించలేదు. ఈ సినిమాలో నీతి టేలర్ ముస్లిం యువతిగా కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
Also Read : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఎన్టీఆర్ శక్తి సినిమా హీరోయిన్…నెట్టింట గ్లామర్ షోతో రచ్చ…
ఆ తర్వాత ఈమె బాలీవుడ్లో పలు సినిమాలలో నటించింది. అయితే ఎప్పుడైనా ఎటువంటి సినిమాలు టీవీలో ప్రసారం అయితే ఆ సినిమా హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉంది, ఏం చేస్తుంది అంటూ చాలా మంది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం మేం వయసుకు వచ్చాం సినిమా హీరోయిన్ ఎలా ఉంది, ఏం చేస్తుంది అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియా మొత్తం గాలిస్తున్నారు. ఈ సినిమాలో తన క్యూట్ క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం హాట్ లుక్ లోకి మారిపోయినట్లు తెలుస్తుంది.
సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. నీతి టేలర్ కు సంబంధించిన కొన్ని క్రేజీ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి స్టన్నింగ్ ఫోటోలకు ముఖ్యంగా కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ చిన్నదాని గ్లామరస్ ఫోటోలు నెట్టింట అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Tollywood neeti taylors latest photo goes viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com