Xiaomi Redmi note 17 Pro series: మనదేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో షావోమి (xiaomi) గట్టిపట్టు ఉంది. ఈ కంపెనీకి రెడ్ మీ సిరీస్ తిరుగులేని ఆయుధంగా ఉంది. ఈ సిరీస్ ద్వారా ఈ కంపెనీ ఇప్పటికే అనేక రకాల మోడల్స్ తీసుకొచ్చింది. తాజాగా Redmi Note 15 Pro 5G ని మార్కెట్లోకి విడుదల చేయబోతోంది.. ఈనెల 15 నుంచి మనదేశంలో అమ్మకాలు మొదలవుతాయని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ మోడల్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో విడుదలైంది. భారీ బ్యాటరీ.. అదిరిపోయే డ్యురబిలిటీతో ఇది స్మార్ట్ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటున్నది. మనదేశంలో దీని ధర దాదాపు 39,999 వరకు ఉండవచ్చని నివేదికల ద్వారా తెలుస్తోంది.
ముఖ్యమైన ఫీచర్లు (expected specs)
డిస్ ప్లే: 6.83 ఇంచుల 1.5k crystal Res AMOLED స్క్రీన్, 120 Hz రి ఫ్రెష్ రేట్.. దీనికి రక్షణగా ఉండే carning Gorilla glass victus 2 (మూడు మీటర్ల ఎత్తు నుంచి పడిపోయిన సరే పగలకుండా ఉండే రక్షణ) ఉంటుంది.
బ్యాటరీ & చార్జింగ్: ఇందులో భారీ 8340 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 67 W హైపర్ ఛార్జ్ (fast charging) సపోర్టుతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులకు పైగా బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.
ప్రాసెసర్: అత్యంత శక్తివంతమైన 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా (OIS support) + 8mp అల్ట్రా వైడ్ కెమెరా, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
రక్షణ (durability) : ఈ ఫోన్కు అత్యున్నతమైన IP 66/ IP 68/ IP 69k రేటింగ్ ఉంటుంది. ఇది పూర్తిగా వాటర్, డస్ట్ రెసిస్టెన్సీ కలిగి ఉంటుంది.
ఓఎస్ (operating system): ఆండ్రాయిడ్ 16 ఆదారిత xiaomi hyper OS 3 ఆధారంగా ఇది పనిచేస్తూ ఉంటుంది.
గ్లోబల్ మార్కెట్లో బలమైన స్థానాన్ని సొంతం చేసుకోవాలని xiaomi కంపెనీ భావిస్తున్న నేపథ్యంలో ఈ మోడల్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అంతేకాదు ప్రీమియం సెగ్మెంట్లో బడ్జెట్ రేంజ్ లో దీనిని అందుబాటులోకి తెచ్చింది. తద్వారా యువతరాన్ని మాత్రమే కాకుండా.. మిడిల్ ఏజ్ వాళ్ళను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో విడుదలైంది. ఈనెల 15న ఇండియన్ మార్కెట్లో విక్రయాలు మొదలవుతాయని.. ఎంపిక చేసిన ఆన్లైన్ వేదికలలో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని xiaomi వర్గాలు చెబుతున్నాయి.