Alternative Fuel Cars: మనదేశంలో కార్ల కొనుగోలు కొంతకాలంగా పెరిగిపోతోంది. వ్యక్తిగత ప్రయాణ సాధనంగా కారును చాలామంది భావిస్తున్నారు. ఒకప్పుడు శ్రీమంతులకు మాత్రమే కారు పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు కారు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. చాలామందిలో ఆర్థిక స్థిరత్వం పెరిగిపోవడం.. ఇంకా రకరకాల కారణాలవల్ల కారు అనేది ఒక తప్పనిసరి ప్రయాణ సాధనంగా మారిపోయింది.
బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం.. తక్కువ డౌన్ పేమెంట్ కే కారును సొంతం చేసుకునే అవకాశం కలగడంతో.. చాలామంది కారులో స్వేచ్ఛగా విహరిస్తున్నారు. ఆటోమొబైల్ నివేదికల ప్రకారం మనదేశంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా కార్ల వినియోగం పెరుగుతుంది. కార్ల కొనుగోలు కూడా అదే స్థాయిలో ఉంటున్నది.
కార్లు అనగానే మనకు డీజిల్ లేదా పెట్రోల్ వేరియంట్ లో లభించే వాహనాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. అయితే ఇప్పుడు క్రమేపీ మనదేశంలో పరిస్థితి మారిపోతుంది. మనదేశంలో కార్లు కొనేవాళ్ళల్లో ఊహించని మార్పు కనిపిస్తోంది. గడచిన నెలలో పెట్రోల్.. డీజిల్ తో నడిచే కార్ల కంటే సిఎన్జి.. హైబ్రిడ్.. ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. వాస్తవానికి ఈ వాహనాల అమ్మకాలు పెరిగిపోవడం ఆటోమొబైల్ వర్క్ ఎలా సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. మనదేశంలో తొలిసారిగా ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలలో ప్రత్యామ్నాయ ఫ్యూయల్ కార్లు పెట్రోల్ కార్లను అధిగమించడం గమనార్హం.
ఆగస్టు నెలలో చోటు చేసుకున్న అమ్మకాలను ఒకసారి పరిశీలిస్తే సిఎన్జి/ ఎల్పిజి కార్ల వాటా ఏకంగా 25.28 శాతంగా ఉంది. ఇందులో హైబ్రిడ్స్ 9.4.. ఈవీలు 7.63 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి ఈ మూడు కేటగిరీలు కలిపితే మొత్తంగా 41.95 శాతం వాటాకు చేరుకున్నాయి. ఇందులో పెట్రోల్ కార్ల బాట 40.85 శాతంగా నమోదు కావడం విశేషం. అయితే దీనిని ఒక కేటగిరీగా చూస్తే మాత్రం పెట్రోల్ కార్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నట్టు లెక్క.
అయితే ఈ మార్పు ఒకరోజులో వచ్చింది కాదు. గడిచిన ఏడాది ఆగస్టు నెలలో ప్రత్యామ్నాయ ఫ్యూయల్ కార్లతో పోతి చూస్తే పెట్రోల్ కార్లకు దాదాపు 12 శాతం పాయింట్లు లీడ్ ఉండేది. ఈ ఏడాది జూలైలో సిఎన్జి, హైబ్రిడ్, టీవీలు కలిపి మొత్తం 40.59 శాతానికి చేరుకున్నాయి. ఇందులో పెట్రోల్ కార్లు 41.68%తో స్వల్పంగా ముందు స్థానంలో ఉన్నాయి. ఆగస్టు నెలలో మాత్రం సిఎన్జి/ హైబ్రిడ్/ ఈవీలు కలిపి మొదటిసారి పెట్రోల్ కార్లను దాటి వేయడం విశేషం.
ఆటోమొబైల్ వర్గాల అంచనా ప్రకారం సిఎన్జి కార్ల ఖర్చు తక్కువగా ఉంటుంది. ఈవీ ల రేంజ్ పెరిగింది. చార్జింగ్ సదుపాయాలు మెరుగుపడ్డాయి. హైబ్రిడ్ మోడల్స్ ఎక్కువగా వచ్చాయి. అందువల్లే ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి పెట్రోల్ పై కూడా కొంతమంది కస్టమర్లలో సందేహాలు ఉన్నాయి. అందువల్లే వారు ప్రత్యామ్నాయ ఫ్యూయల్ కార్ల వైపు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఆగస్టు నెలలో మొత్తంగా 4.02 లక్షల ప్యాసింజర్ వెహికల్స్ రిటైల్ అయ్యాయి.. ఇక గత ఏడాదితో పోల్చి చూస్తే అమ్మకాలు ఏకంగా 16 శాతానికి పెరగడం విశేషం.