Homeబిజినెస్Xiaomi 18 Pro Max: Xiaomi ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. లీకైన సమాచారంతో యూత్...

Xiaomi 18 Pro Max: Xiaomi ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. లీకైన సమాచారంతో యూత్ లో ఉత్సాహం..

Xiaomi 18 Pro Max: స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఎక్కువగా Xiaomi మొబైల్స్ అప్డేట్ పై ఆసక్తిగా ఉంటారు. ఈ కంపెనీ నుంచి కొత్తగా 18 Pro Max అనే మొబైల్ వస్తున్నట్లు ఇప్పటికే కంపెనీ ప్రకటించింది. అయితే తాజాగా ఈ మొబైల్ గురించి తాజాగా ఇంటర్నెట్‌లో లీకులు వచ్చాయి. చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ ‘డిజిటల్ చాట్ స్టేషన్’ అందించిన సమాచారం ప్రకారం.. ఈ సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ అల్ట్రా-ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లోకి రాబోతోంది. ఇంకా ఈ మొబైల్ లో ఏమేం ఉన్నాయో చూద్దాం..

Xiaomi 18 Pro Max ఫోన్‌లో వాడబోయే ప్రాసెసర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో క్వాల్కమ్ కంపెనీకి చెందిన అప్‌కమింగ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో చిప్‌సెట్‌ ఉండనుంది. ఇది అత్యంత అధునాతనమైన 2 నానోమీటర్ ప్రాసెస్‌పై తయారవుతోంది. దీనివల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండటమే కాకుండా, బ్యాటరీ వినియోగం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా, ఇందులో తొలిసారిగా అత్యంత వేగవంతమైన LPDDR6 ర్యామ్ ను కూడా ఉపయోగించబోతున్నట్లు తెలుస్తోంది.

కెమెరా విభాగంలో షావోమి ఈసారి ఊహించని రేంజ్‌లో అప్‌గ్రేడ్స్ చేస్తోంది. షావోమి 18 ప్రో మ్యాక్స్ వెనుక భాగంలో ఏకంగా రెండు 200 మెగాపిక్సెల్ కెమెరాలను ఇవ్వబోతున్నారు. ఇందులో మెయిన్ కెమెరాకు డైనమిక్ రేంజ్‌ను అద్భుతంగా మెరుగుపరిచే LOFIC టెక్నాలజీని జోడించారు. ఇది తక్కువ వెలుతురులో లేదా మిక్స్డ్ లైటింగ్‌లో కూడా అద్భుతమైన ఫోటోలను ఇస్తుంది. అలాగే 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఉంటుంది. ఎప్పటిలాగే ఈ కెమెరాలు ప్రముఖ లైకా (Leica) ట్యూనింగ్‌తో వస్తాయి.

షావోమి ఈ మోడల్‌లో ఏకంగా 8,500mAh భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని టెస్ట్ చేస్తున్నట్లు లీకులు స్పష్టం చేస్తున్నాయి. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ టెక్నాలజీ వల్ల ఫోన్ లావుగా మారకుండా స్లిమ్‌గానే ఉంటుంది. ఈ భారీ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇస్తున్నారు. ఈ ఫోన్ లో 6.9 అంగుళాల OLED ఫ్లాట్ డిస్‌ప్లేతో రానుంది. దీని చుట్టూ ఉండే బెజెల్స్ చాలా సన్నగా, సమానంగా ఉంటాయి. ఇంకా మెరుగైన ఆడియో కోసం అప్‌గ్రేడెడ్ స్టీరియో స్పీకర్లు అమర్చారు.ఈ అల్ట్రా-ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ లో మొదట చైనా మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెడుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular