Xiaomi 18 Pro Max price India: Xiaomi కంపెనీ నుంచి కొత్త ఫ్లాగ్ ఫిష్ మొబైల్ రాబోతుంది. ఇది 18 సిరీస్ కు చెందిన మొబైల్. దీని గురించి పూర్తిగా కంపెనీ వివరాలు తెలియనప్పటికీ కొన్ని అంచనాలు, మరికొన్ని లీక్ ల ద్వారా ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో తెలిసిపోతుంది. ఇందులో బ్యాటరీ పెద్దదిగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే కెమెరా పనితీరు కూడా గతంలో వాటికంటే మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. ఇంతకీ ఈ మొబైల్ ఎలా ఉంది? దీని ధర ఎంతో ఇప్పుడు చూద్దాం..
Xiaomi 18 ప్రో మ్యాక్స్ మొబైల్ Qualcomm ప్రాసెసర్ తో ఉండనుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో SoC కనిపిస్తుంది. ఇందులో 6.9 అంగుళాల పెద్ద స్క్రీన్ ఉండనుంది. ఈ డిస్ప్లే AMOLED తో పనిచేస్తుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. 12gb రామ్ తోపాటు 512జిబి స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ లో నాణ్యమైన కెమెరాను అమర్చునన్నారు. 200 మెగా పిక్సెల్ తో మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే 200 ఎంపీ పెరిస్కోప్, 50 ఎంపీ త్రిపుల్ కెమెరా, 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. నాణ్యమైన ఫోటోలతో పాటు ఏఐ ఆధారిత టీచర్లు ఇందులో కనిపిస్తాయి.
ఈ కొత్త మొబైల్ లో బ్యాటరీ 8000 mAh ఉండనుంది. ఈ బ్యాటరీ 120 W ఫాస్ట్ ఛార్జింగ్ తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఇందులో IP 69, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, వైర్లెస్ చార్జింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. షియోమీ కొత్త మొబైల్ సెప్టెంబర్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీకై అందరిని ఆకర్షిస్తున్నాయి. ఇది మార్కెట్లోకి వస్తే ధర రూ.78,990 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. టాప్ ఎండ్ మొబైల్ 89,990 తో కొనుగోలు చేయవచ్చు.
ప్రస్తుత కాలంలో చాలామంది సోషల్ మీడియా కంటెంట్ సృష్టించేవారు ఉన్నారు. ఇలాంటి వారి కోసం ఈ మొబైల్ ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే కెమెరాతో ఏఐ ఆధారిత ఫోటోలను తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా రోజువారి వినియోగదారులకు బ్యాటరీ వ్యవస్థ కూడా బాగా ఉపయోగపడుతుంది.