Xiaomi 17 Ultra: చైనా మొబైల్ కంపెనీలు భారత్లో దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగా Xiaomi కంపెనీ కొత్తగా 17, 17 ఆల్ట్రా మొబైల్స్ ను లాంచ్ చేసింది. ప్రీమియం మొబైల్స్ కోసం ఎదురుచూసే వారికి ఇవి అద్భుతంగా పని చేయనున్నాయి. ఈ మొబైల్స్ ఇప్పటికే మిగతా దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే లేటెస్ట్ గా ఇండియాలో ప్రవేశించడంతో ఇక్కడ వినియోగదారులు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన కెమెరా తోపాటు బ్యాటరీ సామర్థ్యం మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీమియం స్మార్ట్ ఫోన్ విభాగంలో తన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా Xiaomi ఈ ప్రీమియం ఫోన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Xiaomi 17 సిరీస్ మార్చి 18 నుంచి అందుబాటులోకి రానుంది. Mi వెబ్సైట్ తో పాటు అమెజాన్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. అలాగే రిటైల్ స్టోర్ లోను ఇది అందుబాటులో ఉండనుంది. Xiaomi 17, 17 అల్ట్రా రెండు మొబైల్స్ లోనూ లేటెస్ట్ టెక్నాలజీ ఉండనుంది. వీటిలో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ 5 ప్రాసెసర్ పై నడుస్తాయి. ఈ చిప్ సెట్ మొబైల్ ను వేగవంతంగా పనిచేసేలా సపోర్ట్ చేస్తుంది. మెరుగైన గ్రాఫిక్స్ తో పాటు శక్తి సామర్థ్యాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత Hyper OS 3 ఆపరేటింగ్ సిస్టం ఉండనుంది. అలాగే LPDDR5X ఆల్ట్రా ర్యామ్ తో పాటు UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీని ఇందులో చేర్చారు. దీంతో మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసే వారికి ఈ ఫోన్ బాగా ఉపయోగపడుతుంది.
Xiaomi 17 సిరీస్ 6.3 అంగుళాల OLED e ఉండనుంది. 17 ఆల్ట్రా 6.9 OLED బిగ్ స్క్రీన్ తో కనిపిస్తుంది. ఇవి రెండూ కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తాయి. 3500 nits బ్రైట్నెస్ తో ఖచ్చితమైన రంగులతో డిస్ప్లే అవుతుంది. ఈ రెండు మొబైల్స్ లోనూ 50 MP మెయిన్ కెమెరా ఉండనుంది. అయితే 17 సిరీస్లో 50 MP టెలిఫోటో లెన్స్ ఉండగా.. 17 అల్ట్రా మొబైల్ లో 200 MP టెలిఫోటో కనిపిస్తుంది. ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం రెండిటిలోనూ 50 MP కెమెరా పనిచేయనుంది. ఇందులో 6330 mAh బ్యాటరీ ఉండనుంది. ఇది 100 W ఫాస్టెస్ట్ చార్జింగ్తో పనిచేస్తుంది. వీటితోపాటు బ్లూటూత్ 6.0, వైఫై 7, NFC కనెక్టివిటీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే వంటి ఫీచర్లు ప్రీమియం ఫోన్ కు తీసిపోని విధంగా ఉన్నాయి.
Xiaomi ధర విషయానికి వస్తే రెండు మొబైల్స్ ఒకే రకంగా ఉన్నాయి. 12 GB రామ్, 256 GB స్టోరేజ్ కలిగిన మొబైల్ రూ.89,999 నుంచి కొనుగోలు చేయవచ్చు. టాప్ ఎండ్ మొబైల్ ధర రూ.99,999 గా ఉంది. అయితే SBI డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.10,000 వరకు తగ్గింపు ధరతో పొందవచ్చు.
