spot_img
Homeబిజినెస్Kirana shops impact by quick commerce: కిరాణం షాపులకు భారీ ఎఫెక్ట్..?

Kirana shops impact by quick commerce: కిరాణం షాపులకు భారీ ఎఫెక్ట్..?

Kirana shops impact by quick commerce: మార్కెట్లోకి క్విక్ కామర్స్ ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పటికే చిన్న వ్యాపార సంస్థల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నగరాల్లో, పట్టణాల్లో ఇవి వెలవడంతో చాలామంది వీటికి ఆకర్షితులై కిరాణం షాపుల జోలికి వెళ్లడం లేదు. ఫలితంగా తమకు గిరాకీ తగ్గి వ్యాపారం కావడంలేదని అంటున్నారు. గతంలో కొన్నిసార్లు ఈ స్టోర్లను తీసివేయాలని ఆందోళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ క్విక్ కామర్స్ కేవలం పట్టణాలు, నగరాలకు మాత్రమే కాకుండా చిన్నచిన్న పట్టణాల్లో కూడా వెలుస్తున్నాయి. దీంతో వచ్చే ఐదేళ్లలో కిరాణం షాపులు భారీగా మూతపడే అవకాశం ఉందని అంటున్నారు.

కొన్ని నివేదికల ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 200 నగరాల్లో పది నిమిషాల్లో సరుకులు డెలివరీ చేస్తామనే సంస్థలు వెలిసినట్లు తెలుస్తోంది. ఈ రంగం విస్తరించడంతో భారీగా కిరాణా దుకాణాలపై ప్రభావం పడుతుంది. యువత, ఉద్యోగులు, డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడినవారు 10 నిమిషాల్లో సరుకులు డెలివరీ చేసే సంస్థలపై ఆకర్షితులవుతున్నారు. అలాగే చిన్న పట్టణాల్లో కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువగా ఉండడంతో పాటు యూపీఐ చెల్లింపులు ఎక్కువగా జరుపుతున్న వారు క్విక్ కామర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.

అయితే మరో వర్గం మాత్రం కిరాణం షాపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఎందుకంటే మెట్రో నగరాల్లో కొన్ని ఏళ్లుగా 10 నిమిషాల్లో డెలివరీ చేసే క్విక్ కామర్స్ సంస్థలో ఉన్నప్పటికీ కిరాణం దుకాణాలు పూర్తిగా కనుమరుగు కాలేదని అంటున్నారు. రోజువారి అవసరాల కోసం ఇంటికి దగ్గరలో ఉన్న దుకాణాన్ని ఆశ్రయించడం, అప్పు సౌకర్యం, వ్యక్తిగత పరిచయాలు వంటివి కిరాణం షాపులకు బలంగా నిలుస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, డిజిటల్ సేవలకు దూరంగా ఉన్నవారు స్థానిక దుకాణాలను నమ్ముకుంటున్నట్లు తెలుపుతున్నారు. చిన్న పట్టణాల్లో లాజిస్టిక్స్, ఆర్డర్ డెన్సిటీ వంటి సవాళ్లు క్విక్ కామర్స్ సంస్థలకు సవాలుగా మారుతాయి అని అంటున్నారు. మెట్రో నగరాలతో పోలిస్తే చిన్న పట్టణాల్లో ఆర్డర్లు తక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా డెలివరీ ఖర్చులు పెరగడంతో దీర్ఘకాలంలో ఇవి లాభాలు పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయన్న అభిప్రాయం కూడా ఉంది. ఈ కారణంగా కిరాణం షాపులకు పోటీ ఏమాత్రం ఎక్కువగా ఉండదని అంటున్నారు.

అయితే క్విక్ కామర్స్ కిరాణం షాపులపై ప్రభావం పడే అవకాశం ఉంది. కానీ ఇవి పూర్తిగా కనుమరుగ అయ్యే అవకాశాలు అయితే లేవని కొందరు వాదిస్తున్నారు. స్థానిక దుకాణాలు ఎప్పుడు తక్కువ లాభంతోనే పనిచేస్తాయి.. అంతేకాకుండా అత్యవసర అవసరాలను కూడా తీరుస్తుంటాయి. అందువల్ల కొంతమంది వీటిని నమ్ముకుంటారని అంటున్నారు. అయితే కిరాణం షాపుల వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉంది. కానీ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Oktelugu Epaper