Zepto : ప్రస్తుత బిజీ లైఫ్ లో చాలా మంది ఆఫ్‌లైన్‌కు బదులుగా ఆన్‌లైన్‌లోనే వస్తువులు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి కారణం మంచి సర్వీస్, బయట కంటే ఇక్కడ ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభిస్తాయనే భావన వారిలో ఉంది. అయితే ప్రతిసారీ ఇది నిజం కాదు. కొన్నిసార్లు మంచి డీల్ అనుకుని మోసపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో తరచుగా కనిపస్తుంటుంటాయి. వాటిని చూసిన తర్వాత డిస్కౌంట్ పేరుతో ఆన్ లైన్ షాపింగ్ పేరుతో కంపెనీలు మనతో ఆటలాడుకుంటున్నాయని అనిపిస్తుంది.
తాజాగా ఒక రెడ్డిట్ యూజర్ జెప్టో నుండి రూ.1937 విలువైన వస్తువులను ఆర్డర్ చేశాడు. కానీ బిల్లు వివరాలు చూసిన తర్వాత అతను కంగుతిన్నాడు. ఎందుకంటే ఆ వస్తువులకు ఇంత డబ్బు చెల్లించాల్సి వస్తుందని అతను కలలో కూడా ఊహించలేదు. ఆ వ్యక్తి తెలిపిన ప్రకారం.. డెలివరీ ఛార్జీల పేరుతో అతని నుంచి రూ.65 వసూలు చేశారు. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఫీజు కింద మరో రూ.30, హ్యాండ్లింగ్ కాస్ట్ GST కింద మరో రూ.11.30, GST ప్రాసెసింగ్ ఫీజు కింద మరో రూ.5.40 అదనంగా వసూలు చేశారు.
Also Read : ఫుడ్ డెలివరీ మార్కెట్లో సరికొత్త విప్లవం.. అతి త్వరలో జెప్టో కేఫ్.. ఎలా పని చేస్తుందంటే ?
దీంతో అతను రూ.1937 విలువైన వస్తువులకు మొత్తం రూ.2049.10 బిల్లు వచ్చింది. ఇంత డబ్బు తీసుకున్న తర్వాత బిల్లులో మాత్రం ప్రభుత్వం విధించే పన్నులు, ఛార్జీలలో జెప్టో పాత్ర ఏమీ లేదని పేర్కొన్నారు. తన ఈ ఎక్స్ పీరియన్స్ ను అతడు రెడ్డిట్‌లో షేర్ చేయగా అది క్షణాల్లో వైరల్ అయింది. ఈ వార్త రాసే సమయానికి ఆ రెడ్డిట్ పోస్ట్‌కు 500కు పైగా అప్‌వోట్‌లు, 100కి దగ్గరగా కామెంట్స్ వచ్చాయి.
కామెంట్ సెక్షన్‌ను పరిశీలిస్తే చాలా మంది జెప్టో ఈ విధంగా ప్రజలను మోసం చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఒక నెటిజన్స్ “జెప్టో సూపర్ సేవర్ ఆఫర్ ఒక స్కామ్. డిస్కౌంట్ పేరుతో కస్టమర్‌లను మోసం చేస్తున్నారు అంతే” అని పేర్కొన్నాడు. మరొకరు రాస్తూ, “ఇప్పుడైనా ప్రజలకు అర్థమైంది. ఆఫ్‌లైన్ ఎప్పుడూ బెస్ట్ అని” అని వ్యాఖ్యానించారు. దీనితో పాటు అనేక మంది యూజర్లు దీనిపై కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.
Also Read : మీరు కార్లు బుక్ చేసుకోండి.. ఇంటిముందుకే డెలివరీ ఇక చూసుకోండి.. ఈ ఐడియా మామూల్ది కాదు..