spot_img
Homeక్రీడలుT20 World Cup 200 runs: టీమ్ ఇండియా కాదు.. టి20 వరల్డ్ కప్ లో...

T20 World Cup 200 runs: టీమ్ ఇండియా కాదు.. టి20 వరల్డ్ కప్ లో 200 కొట్టింది ఆ జట్టు.. ఇది మామూలు రికార్డు కాదు

T20 World Cup 200 runs: భారత్, శ్రీలంక క్రికెట్ బోర్డులు సంయుక్తంగా టి20 వరల్డ్ కప్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ టోర్నీలో మొదటి 200 స్కోర్ టీం ఇండియా చేస్తుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే గడచిన కొద్ది సంవత్సరాలుగా టీమిండియా టి20 ఫార్మాట్ లో చరిత్ర సృష్టిస్తోంది. వరుసగా సిరీస్ లు సొంతం చేసుకుంటూ రికార్డుల మీద రికార్డులను తన పేరు మీద రాసుకుంటోంది. ప్రస్తుతం భారత వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో టీమిండియా 200 స్కోర్ చేస్తుందని.. తద్వారా ఈ టోర్నీలో ఈ ఘనత సాధించిన జట్టుగా రికార్డు సృష్టిస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావించారు. అయితే టీమిండియాను కాదని ఓ అనామక జట్టు ఇప్పుడు చరిత్ర సృష్టించింది.

టి20 వరల్డ్ కప్ లో స్కాట్లాండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ సిలో కోల్ కతా వేదికగా సోమవారం ఇటలీ జట్టుతో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ దుమ్మురేపింది. ముందుగా ఇటలీ బౌలింగ్ చేసింది. స్కాట్లాండ్ కోపనర్ జార్జ్ (84) అదిరిపోయే రేంజ్ లో బ్యాటింగ్ చేశాడు. మైకేల్ జోన్స్ (34) సత్తా చూపించాడు. వన్ డౌన్ లో వచ్చిన బ్రెండన్ మెక్ ముల్లన్ (41*) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో మైకేల్ (22*) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. దీంతో స్కాట్లాండ్ జట్టు స్కోర్ ఏకంగా 207 పరుగులు చేసింది. ఈ స్కోర్ ద్వారా టి20 వరల్డ్ కప్ టోర్నీలో 200 లకు పైగా స్కోర్ చేసిన తొలి భాగస్వామ్య జట్టుగా స్కాట్లాండ్ ఘనతను అందుకుంది.

208 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో ఇటలీ ప్రారంభం నుంచి ఇబ్బంది పడింది. మోస్క (0), ఆంటోనీ (13) నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శించారు. దీనికి తోడు స్మట్స్ (22) ఒక స్థాయి ప్రదర్శన చేశాడు. మానేంటి (37), బెన్(52) సత్తా చూపించినప్పటికీ.. మిగతావారు అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఇక మిగతా బ్యాటర్లు దారుణంగా ఆట తీరు ప్రదర్శించారు. ఏకంగా నలుగురు బ్యాటర్లు 0 పరుగులకు అవుట్ అయ్యారు. ఇద్దరు బ్యాటర్లు సింగల్ డిజిట్ స్కోర్ కు పరిమితమయ్యారు. ఫలితంగా ఇటలీ జట్టు 16.4 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేసింది. తద్వారా స్కాట్లాండ్ జట్టు 73 పరుగుల తేడాతో విజయం సాధించింది.

స్కాట్లాండ్ బౌలర్లలో మైకేల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మార్క్ రెండు వికెట్లు సాధించాడు. బ్రాండ్, బ్రాడ్, ఓలివర్ తలా ఒక వికెట్ సాధించారు. బంగ్లాదేశ్ జట్టు ఈ టోర్నీ నుంచి తప్పకుండా నేపథ్యంలో ఊహించని విధంగా స్కాట్లాండ్ జట్టుకు అవకాశం లభించింది. తొలి మ్యాచ్లో స్కాట్లాండ్ వెస్టిండీస్ ముందు నిలబడలేకపోయింది. ఇప్పుడు ఇటలీ జట్టును ఓడించి తొలి గెలుపును అందుకుంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో ఇటలీ జట్టు అర్హత సాధించడం ఇదే మొదటిసారి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Oktelugu Epaper