Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu: ప్రాజెక్టులు కట్టారట.. వైఫల్యం చంద్రబాబుదట!

Chandrababu Naidu: ప్రాజెక్టులు కట్టారట.. వైఫల్యం చంద్రబాబుదట!

Chandrababu Naidu: ఏ ముహూర్తాన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్రెడిట్ చోరీ అనే పదాన్ని వాడారు. కానీ ఆ పదాన్ని విపరీతంగా చోరీ చేసి క్రెడిట్ కొట్టేస్తున్నారు దేశవ్యాప్తంగా కొంతమంది నేతలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసిపి నేతల నోటి నుంచి ఎక్కువగా క్రెడిట్ చోరీ అనే మాట వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏ ప్రారంభోత్సవం చేసినా అది మా క్రెడిట్ అంటూ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఒక్క అమరావతి విషయంలో తప్ప మిగతా ఏ ప్రారంభోత్సవం […]

Chandrababu Naidu: ఏ ముహూర్తాన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్రెడిట్ చోరీ అనే పదాన్ని వాడారు. కానీ ఆ పదాన్ని విపరీతంగా చోరీ చేసి క్రెడిట్ కొట్టేస్తున్నారు దేశవ్యాప్తంగా కొంతమంది నేతలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసిపి నేతల నోటి నుంచి ఎక్కువగా క్రెడిట్ చోరీ అనే మాట వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏ ప్రారంభోత్సవం చేసినా అది మా క్రెడిట్ అంటూ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఒక్క అమరావతి విషయంలో తప్ప మిగతా ఏ ప్రారంభోత్సవం చేసినా అదేపనిగా ప్రకటనలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఒకవైపు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఇంకోవైపు అలా ప్రారంభోత్సవం చేసిన పనుల్లో వైఫల్యాలను వెతుకుతూ ప్రచారం చేస్తున్నారు.

అన్నింటా క్రెడిట్ చోరీ..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తే అది మా క్రెడిట్ అంటూ ప్రకటించుకున్నారు. హింద్రీనీవా ప్రాజెక్టు విషయంలో కూడా అలానే చేశారు. వెలుగోడు ప్రాజెక్టు జాతికి అంకితం చేసింది తానేనని జగన్ ప్రకటించుకున్నారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందించిన ఘనత తనదేనని చెప్పుకున్నారు. అయితే ఇలా ఒక వైపు క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నారు. మరోవైపు ఇలా ప్రారంభోత్సవం చేసిన ప్రాజెక్టుల వైఫల్యాలు, లోపాలపై సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం సహించరానిది, ఐదేళ్ల కాలంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టలేక.. ఇప్పుడు ప్రారంభోత్సవం చేసిన ప్రాజెక్టులను తమ ఖాతాలో వేసుకోవడం అంతకంటే ముర్కత్వం ఉండదు.

లేనిపోని దుష్ప్రచారం..
ఒక పని కి సంబంధించి క్రెడిట్ తీసుకుంటే.. అందులో వెలుగు చూసే వైఫల్యాన్ని కూడా తానే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ననే గోదావరి జలాలు విశాఖకు వచ్చాయి. వాటికి సంబంధించిన పనులను చంద్రబాబు ప్రారంభించారు. అయితే ఓ ఆక్వాడెక్టుకు సంబంధించిన లీకులు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ప్రారంభించారు. దాని బాధ్యతను మాత్రం చంద్రబాబుకు అప్పగించారు. చంద్రబాబు వైఫల్యంగా చెప్పుకున్నారు. అంటే ఆయన ఆ ప్రాజెక్టును నిర్మించినట్టు అంగీకరించినట్టే కదా. వాస్తవానికి ఆక్వాడక్టులో నీటి నిల్వ చేసినప్పుడు.. అంచుల వైపు నుంచి నీరు కారడం అనేది జరుగుతుంది. దానిని మళ్లీ రీఫిల్ చేసి నీటిని విడిచి పెడతారు. ఆ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా తెలుసు. కానీ తమ ఖాతాలో ప్రాజెక్టు కట్టిన క్రెడిట్ వేసుకుని.. కానీ అందులో వైఫల్యాలను మాత్రం తమది కాదన్నట్టు చూపించడం వైసిపి నేతల దుర్బుద్ధిని బయటపెడుతోంది. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper