TaTa Zing Car: ప్రపంచంలో అతి చిన్న కారు ఏదంటే ఏం చెబుతాం.. టాటా నానో కారు అని అందరికీ తెలుసు. కేవలం రూ. లక్ష తో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కారున ఓ మోస్తారుగా అమ్మకాలు సాగించింది. కానీ అనుకున్నంత సక్సెస్ కాలేదనే చెప్పొచ్చు. కానీ నానో కారు కంటే చిన్నకారు కూడా అందుబాటులోకి రావడానికి ప్రయత్నించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఇది బయటకు రాలేదు. కానీ దీని గురించి తాజాగా సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. మరి ఈ కారు గురించి తెలుసుకుందామా..
కార్ల ఉత్పత్తిలో సంచలనాలను సృష్టించాలని కంపెనీలు ఆరాటపడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో టాటా కంపెనీ టాటా నానో కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. కానీదీనిని వినియోగదారులు పెద్దగా ఆదరించలేదు. దీంతో కొంతకాలానికే ఆగపోయింది. అయితే ఈ కారు కంటేచిన్నగాఉండే ‘జింగ్’ ను రెడీ చేశారు. వోక్స్ వ్యాగన్ కంపెనీ ‘బీటిల్’ అనే కారును ఉత్పత్తి చేసింది. ఇది యూరప్ లో ఆదరణ పొందింది. దీని లాగే జింగ్ ను తయారు చేశారు.
టాటా నానో కంటేచిన్నదిగా, సరసమైన ధరకు అందించాలని జింగ్ లో కొన్ని అనూహ్య మార్పులు చేశారు. ట్రాఫిక్ లో సులభంగా నడపగలిగేలా డిజైన్ ను తీర్చి దిద్దారు. అంతేకాకుండా అధిక మైలేజ్ ఇచ్చే విధంగా ఇంజిన్ ను రూపొందించారు. కారు వెనుకా భాగంలో ఇంజిన్ ను అమర్చారు. పరిమాణంలోచిన్న కారు అయినప్పటికీదీనికి నాలుగు డోర్లను ఏర్పాటు చేశారు. ఇందులో 2 సిలిండర్ ఇంజిన్ ను అమర్చి మైలేజ్ ఎక్కువ ఇచ్చేలా చసెట్ చేశారు.
అయితే ఇన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా జింగ్ వినియోగదారులకు పరిచయం కాలేదు. ఈ విషయం బయటకు రావడంతో చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ కారుకు అనుగుణంగా ఇంజన్ పనిచేయకపోవడంతో దీని ఉత్పత్తిని ఆపేశారు. సామాన్యులకు సైతం కారును అందించాలని రతన్ టాటా కోరుకున్నా.. అది నెరవేరలేదు.