TATA Nano: ఒక కారు కొనుగోలు చేసేటప్పుడు ఇందులో ఇంటీరియర్, Exterior ఫీచర్స్ తో పాటు.. ధర కూడా అంచనా వేస్తారు. అయితే ఒకప్పుడు కేవలం ఉన్నత వర్గానికి చెందినవారు మాత్రమే కార్లు కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ సైతం సొంతంగా కారు ఉండాలని కోరుకుంటున్నారు. కంపెనీలు సైతం ఆకర్షణీయమైన.. అనుగుణంగా ఉండే ఫీచర్లతో పాటు తక్కువ ధరలో కారులను అందిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం లక్ష రూపాయలకే కారు అందించిన Tata Nano ను ఇప్పుడు దానిని నేటి వినియోగదారులకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసి ఆకట్టుకునే విధంగా తీసుకురాబోతుంది.. అయితే ఇటీవల దీని విడుదలపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయంటే?
Tata కంపెనీ ప్రీమియం కార్ల తో పాటు కాంపాక్ట్ కార్లపై కూడా శ్రద్ధ చూపిస్తుంది. అందుకే దేశంలో టాప్ సెకండ్ లో ఈ కంపెనీ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు పట్టణ, నగరవాసులకు మెరుగైన డ్రైవింగ్ అనుభూతి కలిగేలా స్మార్ట్ ఫీచర్లతో పాటు ఆకర్షణ ఏమైనా ధరతో టాటా నానోను తీసుకువస్తుంది ఇందులో Exterior డిజైన్ విషయానికి వస్తే ప్రధానంగా LED ల్యాంప్స్ గురించి చెప్పుకోవచ్చు. ఆధునికరించబడిన ఫ్రంటు పాసియా, అందమైన హెడ్ లైట్స్, సూక్ష్మ బాడీ లైన్ ఆకర్షినియంగా ఉంటున్నాయి. వీటితో ఇరుకైన రోడ్లలో కూడా సులభంగా వెళ్లేలా అనుగుణంగా ఉంటుంది. గతంలో వచ్చిన కార్ల కంటే ఇందులో ఎల్ఈడి ల్యాంప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
టాటా నానో కొత్త కారు పూర్తిగా ఎలక్ట్రిక్ కావడంతో ఇందులో శక్తివంతమైన బ్యాటరీని అమర్చారు. 17 నుంచి 20 కిలో వాట్ లిథియం – అయాన్ బ్యాటరీ అమర్చారు. 1000W బ్రుష్లేస్ మోటార్ కలిగి ఉండడంతో ఒక్కసారి చార్జింగ్ చేస్తే 720 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది అలాగే ఆల్ట్రా పాస్టు పది నిమిషాల ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇందులో అమర్చారు. స్మార్ట్ పవర్ మేనేజ్మెంట్ తో పాటు డ్యూయల్ సెట్ అప్ క్రూయిజ్ మోడ్ తో 52 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని పొందవచ్చు.
ఇందులో ఇంటీరియర్ ఫీచర్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ద్వారా స్మార్ట్ కనెక్టివిటీకి సపోర్ట్ ఉంటుంది. స్మార్ట్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంతో పాటు టెక్ ఫ్రెండ్లీ క్యాబిన్ అనుభవాన్ని పొందవచ్చు. ఈ సిస్టం నావిగేషన్, మ్యూజిక్, కాల్ శ్రీ శ్రీనివాస వంటివి డ్రైవర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీతో తయారుచేసిన డాష్ బోర్డు లేఅవుట్ ఆకట్టుకుంటుంది. రోజువారి ప్రయాణం చేసే వారికి అనుగుణంగా ఉంటుంది. టాటా మోటార్స్ నానో ఈవీ కారులో సీట్ బెల్ట్, రీన్ ఫోర్ట్, బాడీ స్ట్రక్చర్స్, ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ వంటివి సేఫ్టీ ఇస్తాయి. కాంపాక్ట్ డిజైన్ కావడంతో నగరాల్లో వీధుల్లో వెళ్లేందుకు అనుగుణంగా ఉంటుంది.
దీనిని రూ.4 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉంది. అయితే అదనపు ఫీచర్లు కావాలంటే ధర పెరిగే అవకాశం ఉంది. తక్కువ ధరలో ఆకర్షణీయమైన, మంచి ఫీచర్స్ కావాలని కోరుకునేవారు దీనిని ఎంపిక చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. కొత్తగా కారు కొనాలని అనుకునే వారికి కూడా ఈ సౌకర్యవంతంగా ఉంటుంది.