TATA iPhone: దేశంలో దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ సరికొత్త ప్రయోగం చేయనుంది. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన ఐపోన్ ను అందించే బాధ్యతను తీసుకోనుంది. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించిన టాటా గ్రూప్ వచ్చే ఏడాది నాటికి ఐపోన్లను సరఫరా చేయడానికి సిద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా 100 యాపిల్ స్టోర్లను తెరిచి ఇందులో కేవలం యాపిల్ ఉత్పత్తులను మాత్రమే విక్రయించనుంది. ఇందుకోసం ప్రీమియం మాల్స్ తో టాటా గ్రూప్ సంప్రదింపులు చేస్తుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న స్టోర్లకు దూరంగా కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాలిక వేస్తున్నారు. అయితే ఈ విషయంపై యాపిల్ సంస్థ గానీ, టాటా గ్రూప్ గానీ అధికారికంగా స్పందించలేదు. ‘ఎకనామిక్స్ టైమ్స్’ లో వచ్చిన ఈ కథనం ఆసక్తిని రేపుతోంది.
న్యూస్ ఏజెన్సీ బ్లూమ్ బెర్గ్ ప్రకారం టాటా గ్రూప్ కర్ణాటకలోని విస్ట్రాన్ కార్పొరేషన్ ఫ్యాక్టరీని కొనుగోలు చేయాలని చూస్తోంది. ఈ ఫ్యాక్టరీలో 10 వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ప్రస్తుతం ఐఫోన్ 14 వెర్షన్ విడిబాగాలను అసెంబ్లింగ్ చేసి సరఫరా చేస్తున్నారు. దీని విలువ 600 మిలియన్ డాలర్లకు పైగా ఉన్నట్లు అంచనా. 2024 మార్చి వరకు 1.8 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను రవాణా చేయడానికి టాటా గ్రూప్ రెడీ అవుతోంది.
ఇప్పటి వరకు ఇక్కడ తైవాన్ కు చెందిన విస్ట్రోన్ కంపెనీ ఈ వ్యవహారాలను నిర్వహిస్తోంది. టాటా గ్రూప్ టేకోవర్ చేసిన తరువాత తైవాన్ కంపెనీ తప్పుకుంటుందని బ్లూమ్ బెర్గ్ నివేదిక తెలిపింది. దేశంలో తయారీ రంగాన్న ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యాపిల్ స్టోర్లను టాటా గ్రూప్ టేకోవర్ చేయడానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక యాపిల్ సంస్థ సైత తన ఉత్పత్తులను భారత్ లో విరివిగా విక్రయాలు జరపాలని చూస్తోంది. ఇందుకు టాటా గ్రూప్ ముందుకు రావడంతో ఒప్పందాన్ని చేసుకున్నట్లు తెలుస్తోంది.
భారతీయ బ్రాండ్ ద్వారా ఐపోన్ ప్రపంచ వ్యాప్తంగా సరఫరా కావడంతో దేశ ఖ్యాతి పెరుగుతుందని అంటున్నారు. దీంతో ఇప్పటి వరకు మొబైల్స్ విషయంలో చైనాపై ఆధారడడం భారత్ కు తగ్గుతుందని భావిస్తున్నారు. టాటా గ్రూప్ టేకోవర్ చేసిన తరువాత ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్ లు టాటా గ్రూప్ నుంచి విడుదల అవుతాయని అంటున్నారు. 2023 ఆగస్టులో కంపెనీని టేకోవర్ చేస్తారని, సెప్టెంబర్ నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుందని అంటున్నారు.