Prashanth Neel NTR Movie: హీరోలను సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చిత్రాలతో నయా ట్రెండ్ స్టార్ట్ చేశాడు. రాఖీ భాయ్ పాత్రకు ఆయనిచ్చిన ఎలివేషన్స్ నభూతో నభవిష్యతి. రాఖీ భాయ్ కనిపించే ఒక్కో సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది. దానికి తోడు ప్రశాంత్ నీల్ క్వాలిటీ స్క్రీన్ ప్లే కెజిఎఫ్ చిత్రాలను గొప్పగా మలిచాయి. మరి అలాంటి దర్శకుడితో ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆశపడతారు. కెజిఎఫ్ 2 వెంటనే ఎన్టీఆర్ తో మూవీ ఉంటుందని అందరూ భావించారు.
అనూహ్యంగా ప్రశాంత్ నీల్ సలార్ ప్రకటించి స్పీడ్ గా సెట్స్ పైకి తీసుకెళ్లాడు. సలార్ కంటే ముందు ఎన్టీఆర్ మూవీ చేయాల్సింది. ఎన్టీఆర్ కూడా అప్పటికి ఆర్ ఆర్ ఆర్ నుండి పూర్తిగా బయటపడలేదు. ఈ కారణాలతో ప్రశాంత్ నీల్ సలార్ ప్రాజెక్ట్ కి ఫిక్స్ అయ్యారు. దీంతో ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివతో దేవరకు కమిట్ అయ్యారు. దేవర చిత్రీకరణ జరుపుకుంటుంది. దేవర అనంతరం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తారని ఫ్యాన్స్ బావిస్తున్నారు.
అయితే ఇక్కడో చిక్కొచ్చి పడింది. ప్రశాంత్ నీల్ సలార్ సైతం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారట. అది కూడా సలార్ విడుదలైన వెంటనే సలార్ 2 షూటింగ్ కి ముహూర్తం పెట్టాడట. అంటే ఎన్టీఆర్ మూవీ ఆలస్యం కానుందని అంటున్నారు. ఎటూ ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ కి కమిట్ అయ్యాడు. ఆయన వార్ కంప్లీట్ చేసే లోపు ప్రశాంత్ నీల్ సలార్ 2 నుండి బయటపడతాడట. అంటే 2024లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ పట్టాలెక్కనుంది అంటున్నారు.
మరో వాదన కూడా వినిపిస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రద్దయ్యే అవకాశం కలదంటున్నారు. అలాగే సలార్ 2 మూవీలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తున్నారట. అనుకోకుండా ప్రాజెక్ట్ డిలే అవుతున్న క్రమంలో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలిసి సినిమా చేయకపోవచ్చంటున్నారు. మరి ఇదే నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నిరాశే అని చెప్పాలి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తమ హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ చూసి చొక్కాలు చించుకుందామని ఆశపడ్డ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.