HomeతెలంగాణKarimnagar Development: కరీంనగర్ రూపు రేఖలు మారబోతున్నాయి..

Karimnagar Development: కరీంనగర్ రూపు రేఖలు మారబోతున్నాయి..

Karimnagar Development: కరీంనగర్‌ అనగానే తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమ జిల్లాగా చాలా మందికి సుపరిచితం. మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది కూడా కరీంనగర్‌ నుంచే. అందుకే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కేంద్రం కూడా పదేళ్ల క్రితం కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీగా ఎంపిక చేసి భారీగా నిధులు కేటాయించింది. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కరీంనగర్‌ ఇక మెట్రోసిటీ స్థాయిలో అభివృద్ధి చెందనుంది. ఇటీవలే కరీంనగర్‌ నగరపాలక సంస్థపై బీజేపీ […]

Karimnagar Development: కరీంనగర్‌ అనగానే తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమ జిల్లాగా చాలా మందికి సుపరిచితం. మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది కూడా కరీంనగర్‌ నుంచే. అందుకే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కేంద్రం కూడా పదేళ్ల క్రితం కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీగా ఎంపిక చేసి భారీగా నిధులు కేటాయించింది. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కరీంనగర్‌ ఇక మెట్రోసిటీ స్థాయిలో అభివృద్ధి చెందనుంది. ఇటీవలే కరీంనగర్‌ నగరపాలక సంస్థపై బీజేపీ జెండా ఎగిరింది. కొత్తగా కొలువు దీరిన నగరపాలక సంస్థ నగర అభివృద్ధి కోసం పంపిన ప్రతిపాదనను కేంద్రం ఆమోదం తెలిపింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల భాగస్వామ్యం..
అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ కింద కరీంనగర్‌కు మొత్తం రూ.840 కోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించనున్నాయి. రాష్ట్ర వాటా రూ.630 కోట్లు కాగా, కేంద్రం రూ.210 కోట్లు అందించనుంది. ఇలాంటి భాగస్వామ్య నమూనా రాష్ట్ర, కేంద్ర సహకారాన్ని బలపరుస్తుంది. అయితే నిధుల సకాలంలో విడుదల, సమర్థవంతమైన వినియోగం మీదనే ప్రాజెక్టు విజయం ఆధారపడి ఉంటుంది.

ప్రధాన అభివృద్ధి రంగాలు
ప్రాజెక్టు కింద డంప్‌యార్డ్‌ ఆధునికీకరణ, శానిటేషన్‌ వ్యవస్థ బలోపేతం, అంతర్గత రహదారులు, జంక్షన్లు, స్కైవాక్‌లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం ఉన్నాయి. ఇవి నగరంలోని రెండు ప్రధాన సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయనున్నారు. డంప్‌యార్డ్, శానిటేషన్‌ పనులు పర్యావరణ పరిరక్షణకు, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తారు. రోడ్లు, జంక్షన్లు, పాదచారుల సౌకర్యాలు ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గించి, నగరాన్ని మరింత ప్రయాణీకుల అనుకూలంగా మార్చగలవు. స్కైవాక్‌లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు ముఖ్యంగా రద్దీ ఎక్కువున్న ప్రాంతాల్లో భద్రతను పెంచుతాయి.

మోట్రోస్థాయి మౌలిక వసతులు..
ఈ పనులు పూర్తయితే కరీంనగర్‌ మెట్రో స్థాయి మౌలిక వసతులకు దగ్గరగా వస్తుంది. స్మార్ట్‌ సిటీ లక్ష్యాలకు అనుగుణంగా వ్యర్థ నిర్వహణ, పాదచారుల సౌకర్యాలు, రహదారి అభివృద్ధి కలిసి వస్తే నగర ఆకర్షణ పెరుగుతుంది. వ్యాపారాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య సేవలు కూడా ఇలాంటి మౌలిక సదుపాయాల నుంచి ప్రయోజనం పొందుతాయి.

కరీంనగర్‌ అభివృద్ధి కొత్త అవకాశాల ద్వారం తెరిచింది. అయితే పనుల వేగం, నాణ్యత, పారదర్శకత మీద దృష్టి పెట్టాలి. స్థానిక ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యతలు నిర్ణయించడం, కాలానుగుణంగా పురోగతిని సమీక్షించడం అవసరం. అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ కరీంనగర్‌ను స్మార్ట్, సౌకర్యవంతమైన నగరంగా మార్చే దిశగా ఒక గట్టి పునాది వేస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper