Chips Ban: మధ్యాహ్నం అన్నం తింటున్నప్పుడు.. సాయంత్రం స్నాక్స్ తింటున్నప్పుడు మన దవడల కింద చిప్స్ ఏదో ఒక సందర్భంలో కరకరలాడుతూనే ఉంటాయి. ఇక పాపడ్స్ మన మిడ్ డే మీల్ లో కచ్చితంగా ఉంటాయి. పాపడాలు కూడా మన పొట్టలోకి వెళ్ళిపోతూ ఉంటాయి.
పాపడాలను.. అప్పడాలను.. చిప్స్ ను ఇష్టపడని వారు ఉండరు. పైగా ఇది పంటికింద వేసుకోగానే ఉప్పు, కారం రుచిత ఉంటాయి. దవడల కింద నలిగిపోతూ ఉంటాయి. అదొక రకమైన అనుభూతి. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసలు వారు వీటిని తినడాన్ని ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనంలో నంజుకోవడానికి ఆసక్తిని చూపిస్తుంటారు..
ఈ ఆహారం గురించి గతంలో ఎటువంటి అపోహలు ఉండేవి కాదు. పైగా మన పెద్దలు గుమ్మడికాయ వడియాలు.. రేగు వడియాలు చేసేవారు. అప్పడాలు కూడా ఇంట్లోనే తయారు చేసేవారు. వేసవికాలంలో వీటిని తయారుచేసి.. ఎండబెట్టి.. గాజు సీసాలలో భద్రపరిచేవారు. అప్పట్లో వీడి గురించి ఎటువంటి ఆరోపణలు గానీ.. విమర్శలు గాని ఉండేవి కాదు. పైగా ఇవి సమర్థవంతమైన పోషకాహారంగా ఉండేవి.
ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అప్పడాలు.. వడియాలు.. చిప్స్ తయారీలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నారు. వీటివల్ల జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని రకరకాలైన కృత్రిమ పద్ధతులను అవలంబిస్తుండడంతో.. వీటిని తిన్నవారిలో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.
వీటి వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కేంద్రం భావిస్తోంది. అప్పడాలు.. వడియాలు.. చిప్స్ తయారీలో కృత్రిమ రంగులను వాడటం.. ప్రమాదకరమైన పదార్థాలను ఉపయోగించడం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని కేంద్ర ప్రభుత్వ సర్వేలో ఇటీవల తేలింది. అందువల్లే వీటి వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం వీటిని నిషేధిస్తూ నిర్ణయాలు తీసుకుంది. పిల్లలకు వీటికి బదులుగా పాఠశాలలో చికెన్ బిర్యాని పెట్టాలని నిర్ణయించింది. అయితే తమిళనాడు ప్రభుత్వం మాదిరిగానే దేశం మొత్తంలో కూడా వీటిపై బ్యాన్ విధించాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఓ కంపెనీకి సంబంధించిన చిప్స్ కూడా అత్యంత అనారోగ్యకరమైనవని తేలింది. దీనిపై అప్పట్లో కేంద్రం కూడా ఆ కంపెనీకి సంబంధించిన చిప్స్ మార్కెట్లోకి రాకుండా చర్యలు తీసుకుంది. ఆ తర్వాత అనేక రకాలుగా ఆ కంపెనీ మార్పులు చేర్పులు చేసిన తర్వాత.. కేంద్రం ఒప్పుకుంది. అయితే ఇప్పుడు ఈ చిప్స్ మాత్రమే కాకుండా అప్పడాలు.. వడియాలు కూడా బ్యాన్ చేయాలని.. వాటి తయారీలో ప్రమాదకరమైన పదార్థాలు వాడుతున్నారని కేంద్రం గుర్తించింది.