Homeబిజినెస్Samsung A57 A37 launch features: Samsung నుంచి రెండు కొత్త మొబైల్స్.. ఫీచర్స్ తెలిస్తే...

Samsung A57 A37 launch features: Samsung నుంచి రెండు కొత్త మొబైల్స్.. ఫీచర్స్ తెలిస్తే క్యూ కడుతారు..

Samsung A57 A37 launch features: ప్రముఖ మొబైల్ కంపెనీ Samsung నుంచి ఏ కొత్త మొబైల్ మార్కెట్లోకి వచ్చినా వెంటనే కొనాలని చూస్తారు. అయితే ఈ కంపెనీ వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటుంది. లేటేస్ట్ వినియోగదారులను ఆకర్షించేందుకు స్మార్ట్ ఫీచర్లతో పాటు ఆడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన ఫోన్లను తీసుకురాబోతుంది. వీటికి A57, A37అనే పేర్లు పెట్టిన కంపెనీ ఇందులో ఇప్పటివరకు చూడని సాఫ్ట్ వేర్లను ఈ కొత్త మొబైల్స్ లో చూపించబోతుంది. ఇంతకీ ఇందులో ఎలాంటి ఫీచర్లు, సాప్ట్ వేర్లు ఉంటాయంటే?

Samsung నుంచి కొత్తగా వచ్చే మొబైల్స్ A57, A37. ఇందులో భాగంగా A57మొబైల్ లో 6.7 అంగుళాల HD+Amoled డిస్ ప్లేను చూడొచ్చు. ఈ డిస్ ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇందులో 6 O.Sఅప్డేట్ తో పనిచేసే ఈ మొబైల్ లో ఉండే సాఫ్ట్ వేర్ ఆరేళ్ల పాటు సెక్యూరిటీని అందిస్తుంది. ఇందలో ఆండ్రాయిడ్ 16 ఆధారిత 8.5 ప్రాసెసర్ ఉండనుంది. అలాదే 1680 ఎగ్జినోస్ ఉండడంతో ఇందులో ఏఐ ఫీచర్లను చూడొచ్చు అని అంటున్నారు.

ఈ మొబైల్ లో కెమెరా గురించ ప్రత్యేకంగా చెప్పకోవచ్చు. ఈ మొబైల్ లో 50 ఎంపీ మెయిన్ కెమెరా ఉండనుంది. 12 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ తో కెమెరా పనిచేయనుంది. 12 మెగా పిక్సెల్ సెల్పీతో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేయనుంది. ఈ మొబైల్ లో 500 mAh బ్యాటరీ పనిచేయనుంది. ఈ బ్యాటరీ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయనుంది. నిమిషాల్లో 0 నుంచి 60 శాతం చార్జింగ్ సపోర్టు చేసే ఈ మొబైల్ 179 గ్రాముల బరువు ఉంటుంది. అలాగే ఇందులో వాయిస్ ట్రాన్స్ స్క్రిప్షన్, ఏఐ సెలెక్ట్, సర్కిల్ టు సెర్చ్ వంటి ఏఐ పీచర్లు ఉండనున్నాయి. ఇది మార్కెట్లోకి వస్తే 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ కలిగిన మొబైల్ ను రూ. 56,999తో విక్రయించనున్నారు. టాప్ ఎండ్ మొబైల్ ధర రూ.62,499గా నిర్ణయించారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇదే కంపెనీ నుంచి మరో ఫోన్ రాబోతుంది. అదే A37. ఈ మొబైల్ 6.7 అంగుళాల డిస్ ప్లే తో పనిచేయనుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఈ మొబైల్ లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత సాప్ట్ ఫేర్ తో కూడినా సాంసంగ్ వన్ యూఐ 8.5 సాప్ట్ వేర్ ఉండనుంది. ఇది కూడా 6 ఓఎస్ అప్టేడ్ తో పనిచేస్తుంది. ఆరేళ్ల పాటు సెక్యూరిటీని అందించే ఇందులో కూడా ఏఐ ఫీచర్లు కనిపిస్తాయి. ఏ37 మొబైల్ లో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉండనుంది. 8 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ తో కూడిన కెమెరాతో పాటు 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేయనుంది. ఈ కొత్త మొబైల్ లో 500 mAh బ్యాటరీ ఉండగా.. ఇది 196 గ్రాముల బరువుతో అలరిస్తుంది. దీనిని మార్కెట్లో రూ.41,999 ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. టాప్ ఎండ్ మొబైల్ రూ. 52,999గా ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Hardik Pandya

Hardik Pandya: హార్దిక్ చెప్పినట్టు.. సీఎస్కే మేనేజ్మెంట్ ఆడుతోంది.. ఏం జరుగుతుందో..

Hardik Pandya: గొప్ప ఆటగాడే. గతంలో గుజరాత్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. మరోసారి ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. కానీ ఆ తర్వాత మనోడి ఆట మారిపోయింది. బౌలింగ్ తన స్థాయిలో...
RHA Movement

RHA Movement: దేశవ్యాప్తంగా మరో ఉద్యమం.. ఈసారి అదే లక్ష్యం!

RHA Movement: సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన కాక్రోచ్ వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా ఉద్యమించిన సీజీపీ నీటి...
YSRCP Rayalaseema

YSRCP Rayalaseema: రాయలసీమలో వైసీపీకి కష్టమే!

YSRCP Rayalaseema: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ధీమా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ఆ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో తమ పార్టీకి ఆదరణ పెరుగుతోందని.. పూర్వవైభవం ఖాయమని జగన్మోహన్...
AP MLC Elections 2026

AP MLC Elections 2026: రేపటితో ఆ ఇద్దరు.. ఏపీలో మొదలుకాని ఎమ్మెల్సీ ఎన్నికల సందడి!

AP MLC Elections 2026: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈనెల 28 తో గవర్నర్ కోటా కింద రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి సంబంధించి ఎన్నికల సంఘం...
Ellamma Cheruvu

Ellamma Cheruvu: కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కాదు.. తెలంగాణలో ఈ చెరువే దేశానికి ఆదర్శం

Ellamma Cheruvu: గోదావరి కిందికి పోతుంటే పైకి తీసుకొచ్చాం. వందల మీటర్లు గ్రావిటీకి వ్యతిరేకంగా ప్రవహించేలా చేసాం. లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. తాగునీటి అవసరాలు తీర్చాం. సాగునీటి అవసరాలు తీర్చాం....
Oktelugu Epaper