Homeబిజినెస్OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన మొబైల్స్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఒక్క రోజు పూర్తిగా రావడం కష్టమయ్యేది. కానీ ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న ఓ ఫోన్ ను ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 2.5 రోజుల బ్యాకప్ వస్తుంది. ఇంతకీ ఇందులో ఉన్న బ్యాటరీ పవర్ […]

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన మొబైల్స్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఒక్క రోజు పూర్తిగా రావడం కష్టమయ్యేది. కానీ ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న ఓ ఫోన్ ను ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 2.5 రోజుల బ్యాకప్ వస్తుంది. ఇంతకీ ఇందులో ఉన్న బ్యాటరీ పవర్ ఎంత? ఇది ఏ ఫోన్?

OnePlus కంపెనీ ఇప్పటి వరకు ప్రీమియం ఫోన్ పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. కానీ ఇప్పుడు బడ్జెట్ ఫోన్లను తీసుకురావడంలో శ్రద్ద చూపిస్తోంది. ఇందులో భాగంగా అతి త్వరలో ఈ కంపెనీ నుంచి OnePlus N6x అనే మొబైల్ రాబోతుంది. దీని గురించి మైక్రో సైట్ లో టీజర్ రిలీజ్ అయింది. దీని ప్రకారం ఈ మొబైల్ లో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్ లో 7000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని ఉంచనున్నారు. ఈ బ్యాటరీ సాధారణ వినియోగం చేస్తే రెండున్నర రోజుల పాటు బ్యాకప్ వస్తుంది. దీంతో మల్టీ టాస్కింగ్ యూజర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఈ మొబైల్ లో బ్యాటరీ మాత్రమే కాకుండా ఇతర ఫీచర్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో బ్యాక్ సైడ్ ఫిల్ షేప్ డిజైన్ కలిగిన కెమెరా ఉంది. 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కెమెరాను అమర్చారు. ఈ డిజైన్ ఇటీవల మార్కెట్లోకి వచ్చిన వన్ ప్లస్ నార్డ్ 5 సిరీస్ నుంచి ప్రేరణ పొందింది. ఈ ఫోన్ ఐస్ బ్లూ, బుర్గుండి అనే రెండు కలర్లలో లభించే అవకాశం ఉంది.

జూలై 31న లాంచ్ అయ్యే ఈ ఫోన్ ధర రూ.20 వేల లోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే విడుదలైన రోజున అధికారికంగా తెలిసే అవకాశం ఉంది. అమెజాన్ ఇండియా తో పాటు వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్లలో ఈ ఫోన్ ను కొనుగోలు చేయొచ్చు. తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోసం చేసే వారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper