Oppo K14 Lite : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo భారత్‌లో తన K సిరీస్‌లో కొత్త ఫోన్ Oppo K14 Liteను విడుదల చేసింది. పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. రెండు కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.16,999గా ఉంది.
ధర, లభ్యత
Oppo K14 Lite 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. Feather Purple, Stone Brown కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. Oppo ఈ ఫోన్‌ను నేటి నుంచే Oppo ఈ-స్టోర్, Flipkart ద్వారా విక్రయిస్తోంది. లాంచ్ ఆఫర్‌లో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ.1,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఎఫెక్టివ్ ధర రూ.15,999కి తగ్గుతుంది. అదనంగా మూడు నెలల నో-కాస్ట్ EMI సదుపాయం కూడా ఉంది.
స్పెసిఫికేషన్లు
Oppo K14 Liteలో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. ఇది 720×1570 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. Splash Touch, Oily-Hand Touch, Glove Touch ఫీచర్లతో తడి లేదా గ్లౌవ్స్‌తో ఉన్న చేతులతోనూ స్క్రీన్‌ను ఉపయోగించవచ్చు.
ఈ ఫోన్ Unisoc T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4GB LPDDR4X RAM, 64GB UFS 2.2 స్టోరేజ్ ఉన్నాయి. గ్రాఫైట్ కూలింగ్ ఏరియా 13,700 చదరపు మిల్లీమీటర్ల వరకు ఉంటుంది.
కెమెరాల విషయానికి వస్తే.. వెనుక 13MP ఆటోఫోకస్ కెమెరా, ముందు 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. AI Eraser, AI Clear Face వంటి ఫీచర్లు కూడా అందించారు.
ఫోన్‌లో 7,000mAh బ్యాటరీ ఉంది. 15W ఛార్జింగ్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 55.55 గంటల కాలింగ్, 26.84 గంటల యూట్యూబ్ ప్లేబ్యాక్ వరకు బ్యాకప్ ఇస్తుందని Oppo తెలిపింది. IP64 రేటింగ్‌తో దుమ్ము, నీటి చిమ్మరింపుల నుంచి రక్షణ లభిస్తుంది.