FD Interest Rates: బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు వాళ్లకు ఒక మంచి ఎంపీక అయ్యే అవకాశం ఉంది. బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లో మీరు స్థిర వడ్డీనీ పొందవచ్చు. ఇందులో మీకు రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. బ్యాంక్ అధికారులు తమ కస్టమర్లకు చాలా ఆకర్షణీయమైన ప్రత్యేక ఎఫ్డి పథకాలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో కస్టమర్ల కోసం ప్రభుత్వ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్ ఎఫ్డి పై వడ్డీ రేట్లను సవరించడం జరిగింది. కస్టమర్ల కోసం రెండు కొత్త ఎండి పథకాలను కూడా ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది.IND SECURE,IND GREEN అనే రెండు కొత్త పథకాలు కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ బ్యాంకులో 300 రోజుల్లో అలాగే 400 రోజుల్లో పూర్తి అయ్యే ఎఫ్డి పథకాలను బ్యాంకు నిలిపివేసినట్లు తెలుస్తుంది.
Also Read: బల్లితోక ఐస్‌క్రీం.. కావాలంటే అహ్మదాబాద్ వెళ్లాల్సిందే!
ఈ మధ్యకాలంలో ప్రభుత్వరంగ సంస్థ బ్యాంకు ఎఫ్డీ లపై వడ్డీ రేటును సవరించిన తర్వాత ఏడాదికి 2.80 శాతం నుంచి 7.15 శాతం వరకు పెరిగినట్లు సమాచారం. ఈ బ్యాంకులో 300 కోట్ల కంటే తక్కువ విలువ గల ఫిక్స్డ్ డిపాజిట్ లపై సాధారణ పౌరులకు వడ్డీ కూడా ఉంది. ఏడు నుంచి 15 రోజుల అత్యల్ప ఎఫ్డి కలిగి ఉన్నవారికి ఈ బ్యాంకులో 2.80 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే 444 రోజుల ఎఫ్ డి లు కలిగి ఉన్న వారికి 7.15% అత్యధిక వడ్డీ లభిస్తుంది. మే 8వ తేదీన ఇండియన్ బ్యాంకు IND SECURE అనే రిటైల్ హాట్ డిపాజిట్ ప్రోడక్ట్ పథకాన్ని మొదలుపెట్టింది. దీని కాలపరిమితి 444 రోజులు.
కనీసంగా ఇందులో వెయ్యి రూపాయల నుంచి గరిష్టంగా మూడు కోట్ల వరకు వినియోగదారులు పెట్టుబడి పెట్టుకోవచ్చు. సాధారణ పౌరులకు ఈ పథకం పై 7.15% వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే సీనియర్ సిటిజనులకు ఈ పథకంపై 7.65 శాతం ఒకటి రేటు ఉంటుంది. సూపర్ సీనియర్ సిటిజనులకు 7.90% వడ్డీని అందిస్తున్నారు. అయితే సెప్టెంబర్ 30, 2025 మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టుకునే అవకాశం ఉంది. అలాగే ఇండియన్ బ్యాంక్ IND GREEN రిటైర్డ్ టర్మ్ డిపాజిట్ ప్రోడక్ట్ స్పెషల్ ఎఫ్డి ని కూడా ఈ నెల 8న ప్రారంభించింది. దీని కాల పరిమితి 555 రోజులు. కనీసం గా ఇందులో వెయ్యి రూపాయల నుంచి మూడు కోట్ల వరకు పెట్టుబడి చేయవచ్చు. సాధారణ పౌరులకు ఇందులో 6.80 శాతం వడ్డీ లభిస్తుంది.