Homeఆంధ్రప్రదేశ్‌Bill Gates: బిల్ గేట్స్ నూ వదలరా.. ఛీ ఇదేం పని?!

Bill Gates: బిల్ గేట్స్ నూ వదలరా.. ఛీ ఇదేం పని?!

Bill Gates: ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ వస్తే తప్పు. తన స్నేహితుడు చంద్రబాబు గురించి మంచి మాట చెబితే తప్పు. పొరుగు రాష్ట్రాల నుంచి నేతలు వచ్చి చంద్రబాబును అభినందిస్తే తప్పు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెడితే తప్పు. ఇప్పుడు బిల్ గేట్స్ అమరావతి వస్తే తప్పు. చంద్రబాబును కలిస్తే తప్పు. చంద్రబాబును అభినందిస్తే తప్పు. చివరికి బిల్ గేట్స్ కూడా తప్పుడు మనిషి అని చెప్పడానికి కూడా వెనుకడుగు వేయని బ్యాచ్ ఒకటి ఉంది. వారికి తెలిసిందల్లా కోడి గుడ్డుపై ఈకలు పీకడమే. ఐటీ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టించి.. తాను సంపాదించిన సంపదలో కొంత మొత్తం ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో వచ్చిన బిల్ గేట్స్ పై బురద జల్లుతున్నారు అంటే ఏపీలో జరుగుతున్న వికృత క్రీడ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

* రంగంలోకి కుహనా మేధావులు..
బిల్ గేట్స్( Bill Gates) ఏపీతోపాటు మహారాష్ట్రలో కూడా పర్యటించారు. అయితే కొంతమంది కుహనా మేధావులు, వైసీపీ నేతలు అతిగా స్పందిస్తున్నారు. జెఫ్రీ ఎప్ స్టీల్ తో కలిసి నరాలకు పాల్పడినట్లు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో బిల్ గేట్స్ ను నిందిస్తున్నారు. అటువంటి వ్యక్తిని స్వాగతం పలకడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పటికే దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు బిల్ గేట్స్. ఒకవేళ బిల్ గేట్స్ ప్రమేయం ఉంటే అమెరికన్ చట్టాలు విడిచి పెట్టవు. ఈ విషయం తెలిసి కూడా లేనిపోని ప్రచారం చేస్తున్నారు.

* చాలాసార్లు స్పష్టత..
బిల్ గేట్స్ తన గతంలో చాలాసార్లు వివరణ ఇచ్చారు. జెఫ్రీ ఎప్ స్టీన్ తో( Jeffrey yep Steen )ఉన్న తన పరిచయాల విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆయనపై కొన్ని రకాల నెరారోపణలు రావడంతో దానికి చింతించారు బిల్ గేట్స్. ఆయనతో గడిపిన ప్రతి నిమిషానికి నేను చింతిస్తున్నాను అని స్వయంగా పేర్కొన్నారు. అయితే బిల్ గేట్స్ వ్యక్తిగత జీవితాన్ని ముడి పెట్టుకొని.. ఆయన సాధించిన అద్భుత సాంకేతిక విజయాలను, ప్రపంచానికి అందించిన సాఫ్ట్వేర్ విప్లవాన్ని తక్కువ చేసి చూడడం ఎంత మాత్రం సరికాదు. నిజంగా బిల్ గేట్స్ లాంటి దిగ్గజం తప్పు చేసి ఉంటే అమెరికన్ చట్టాలు విడిచిపెట్టవు. ఆయనపై వచ్చిన నేరారోపణలు రుజువు కాలేదు. అయినా బిల్ గేట్స్ లాంటి వ్యక్తి ఏపీకి వచ్చి.. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే అంతకంటే అదృష్టం ఏమి ఉంటుంది.

* దశాబ్దాలుగా సేవలు..
బిల్ గేట్స్ ప్రపంచ ఐటీ దిగ్గజం. మైక్రోసాఫ్ట్( Microsoft) వ్యవస్థాపకుడు. తనకున్న అద్భుత సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన ఘనత ఆయనది. ఎంతోమంది ప్రపంచ దేశాల నేతలు ఆయన కోసం ఎదురు చూస్తుంటారు. అయితే అంతులేని సంపద చూశారు బిల్ గేట్స్. అందులో కొంతమంది సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఆలోచనతో గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. 2026 సంవత్సరానికి గాను ఈ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9 బిలియన్ డాలర్లు.. అంటే 90 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రకటించింది. అయితే ప్రపంచ దేశాల్లో ఈ ఫౌండేషన్ ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. 2003 నుంచి ఇండియాలో సైతం హెచ్ఐవి నివారణ, పోలియో నిర్మూలన, మాతా శిశు ఆరోగ్యం వంటి రంగాల్లో ఈ ఫౌండేషన్ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఐటీ దిగ్గజంగా, మహాదాతగా పేరు ఉన్న వ్యక్తిని నిందించడం ఎంత మాత్రం సహేతుకం కాదు. కేవలం రాజకీయ కోణంలో కోడిగుడ్లపై ఈకలు పీకే విధంగా బిల్ గేట్స్ ను టార్గెట్ చేసుకుంటున్నారు కుహనా మేధావులు. ఇటువంటి అవ లక్షణాలు ఏపీలోనే కనిపిస్తుండడం నిజంగా దుర్మార్గం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular