Maruti
Maruti: మారుతి సుజుకి ఇండియా కార్లు సేఫ్టీ విషయంలో కొన్ని విమర్శలు ఎదుర్కొంటుండవచ్చు. కానీ మైలేజ్, లో మెయింటెనెన్స్ ఖర్చు, క్వాలిటీ, వాటి రీసేల్ విలువ గురించి ఎలాంటి సందేహం లేదు. ఇటీవల సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మే, కొనే ఒక ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం నిర్వహించిన సర్వేలో కూడా ఇదే విషయం తేలింది. మారుతి కార్లను 5 సంవత్సరాలు వాడిన తర్వాత కూడా వాటిని తిరిగి అమ్మితే కస్టమర్లకు మంచి ధర లభిస్తుంది.
ఆటోకార్ వార్తా కథనం ప్రకారం.. స్పినీ అనే సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో మారుతి డిజైర్, హోండా అమేజ్, టాటా టిగోర్‌లను పరిగణలోకి తీసుకున్నారు. సాధారణంగా ఈ కార్లన్నీ భారతదేశంలో ఫ్లీట్ వాహనాలుగా చాలా పాపులారిటీ సాధించాయి. ఈ కార్లన్నింటి 5 సంవత్సరాల కాలంలో రీసేల్ విలువను లెక్కించినప్పుడు మారుతి సుజుకి ఇండియా అత్యుత్తమ రాబడినిచ్చే కంపెనీగా నిలిచింది.
స్పినీ సర్వేలో తేలింది ఏమిటంటే.. 5 సంవత్సరాలలో మారుతి డిజైర్ మొత్తం విలువలో తరుగుదల దాదాపు 33 శాతం మాత్రమే ఉంది. ఈ విధంగా సర్వేలో పాల్గొన్న ఇతర కార్లన్నింటితో పోలిస్తే, మారుతి కారును 5 సంవత్సరాల తర్వాత అమ్మినా 70 శాతం వరకు తిరిగి వ్యాల్యూ లభిస్తుంది.
అదే సమయంలో ఈ విషయంలో హోండా అమేజ్ విలువ 5 సంవత్సరాలలో 38 శాతం వరకు తగ్గుతుంది. ఈ లెక్కన హోండా కార్లను రీసేల్ చేస్తే 60 శాతం వరకు విలువ తిరిగి వస్తుంది. టాటా టిగోర్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సర్వే ప్రకారం, 5 సంవత్సరాలలో దాని విలువ 47 శాతం వరకు తగ్గుతుంది. అంటే కారు విలువ సగానికి పడిపోతుంది.
మారుతి మొదటి 5-స్టార్ రేటింగ్ కారు
స్పినీ సర్వేలో పేర్కొన్న మారుతి డిజైర్, మారుతి సుజుకి మొదటి 5-స్టార్ రేటింగ్ కలిగిన కారు. కంపెనీ దీన్ని గత సంవత్సరమే విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.84 లక్షలు. కొత్త మారుతి డిజైర్‌లో కంపెనీ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అందించింది. ఇది 80 bhp పవర్, 112 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది సీఎన్జీలో కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌లో ఈ కారు లీటరకు 24.79కిలో మీటర్లు, పెట్రోల్ AMT లీటరుకు 25.71కిలో మీటర్లు, CNG వేరియంట్ కిలోకు 33.73కిలో మీటర్లు మైలేజీని ఇస్తుంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Maruti beats honda tata number one resale value
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com