Mahindra: భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో భారతీయ ఎస్యూవీ తయారీదారు మహీంద్రా తన కొనుగోలుదారులను సంతోషపరిచింది. మహీంద్రా XUV700 ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ ఇప్పుడు మరింత అందుబాటులోకి వచ్చింది. మహీంద్రా ఇప్పుడు AX7 ట్రిమ్‌తో ఆల్-వీల్ డ్రైవ్‌ను అందిస్తుండడమే దీనికి కారణం. ఇంతకుముందు ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ టాప్-ఎండ్ AX7L మోడల్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. కొత్త వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.23.04 లక్షలు.. వినియోగదారులు ఈ వేరియంట్‌తో ఎబోనీ ఎడిషన్‌ను కూడా పొందవచ్చు.
కొత్త వేరియంట్ ఇంజన్ స్పెసిఫికేషన్లలో ఎటువంటి మార్పు లేదు. AX7L AWD వలెనే AX7 AWD కూడా స్పెషల్ గా డీజిల్ ఇంజన్‌తో అందించబడుతోంది. ఈ ఇంజన్ 2.2-లీటర్ mHawk ఇంజన్, ఇది 3,500 rpm వద్ద 182 bhp పవర్, 1,750 నుంచి 2,800 rpm మధ్య 450 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే జతచేయబడింది. మహీంద్రా XUV700 ధర రూ.13.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.25.74 లక్షల వరకు ఉంటుంది. ఈ రెండు ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద వర్తిస్తాయి.
చాలా పవర్ఫుల్ ఇంజన్
ఎంఎక్స్ వేరియంట్‌లో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించారు. కానీ ఇందులో ట్యూనింగ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది 152 bhp పవర్, 360 Nm పీక్ టార్క్‌ను అందిస్తుంది. ఇది కేవలం 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజన్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్, ఇది 197 bhp పవర్, 380 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా అందుబాటులో ఉంది.
XUV700 ఫీచర్లు
AX7 వేరియంట్‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఇంటెలి కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, వైపర్‌లతో పాటు డ్రైవర్ నిద్రపోతున్నట్లు గుర్తించే ఫీచర్ కూడా ఉన్నాయి. లుక్స్ పరంగా ఇందులో 18-ఇంచుల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, లెదరెట్ స్టీరింగ్ వీల్, లెదరెట్ సీట్లు, లెదరెట్ గేర్ లివర్ ఉన్నాయి. బ్రాండ్ వెల్కమ్ రిట్రాక్ట్‌తో 6-వే పవర్డ్ సీటు, ఆటో బూస్టర్‌తో LED హెడ్‌ల్యాంప్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ ORVMలు, స్మార్ట్ క్లోజ్‌తో వన్-టచ్ డ్రైవర్ విండో, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కో-డ్రైవర్ ఎర్గో లివర్ వంటి సౌకర్యాలను అందిస్తోంది.