స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్ సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. వివో సబ్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో iQOO 16 లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించి పలు లీకులు, బెంచ్‌మార్క్ వివరాలు బయటకు రాగా.. తాజాగా డిస్‌ప్లే విషయంలో వచ్చిన సమాచారం టెక్ ప్రియుల ఆసక్తిని మరింత పెంచుతోంది. ముఖ్యంగా ఆపిల్ నుంచి రానున్నట్లు ప్రచారం జరుగుతున్న ఐఫోన్ అల్ట్రా లో ఉపయోగించనున్న టెక్నాలజీకి దగ్గరగా ఉండే డిస్‌ప్లేను iQOO 16లో అందించనున్నట్లు టిప్‌స్టర్ వెల్లడించారు.
చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబో లో ప్రముఖ టిప్‌స్టర్ Digital Chat Station వెల్లడించిన వివరాల ప్రకారం.. iQOO 16లో సామ్‌సంగ్ అభివృద్ధి చేసిన లేటెస్ట్ OLED డిస్‌ప్లేను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో M16 లూమినసెంట్ మెటీరియల్తో పాటు, నెక్స్ట్ జనరేషన్ ఎల్.ఈఏడీ (Low Power, Eco-Friendly, Augmented Brightness, Design Slim and Light) డిస్‌ప్లే టెక్నాలజీ ఉండనున్నట్లు సమాచారం.
ఆండ్రాయిడ్‌లోనే తొలిసారి?
ఈ లీక్ నిజమైతే సామ్ సంగ్ ఎల్.ఈఏడీ డిస్‌ప్లే టెక్నాలజీని ఉపయోగించే తొలి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌గా iQOO 16 నిలిచే అవకాశం ఉంది. తక్కువ విద్యుత్ వినియోగంతో పాటు ఎక్కువ బ్రైట్‌నెస్, సన్నని డిజైన్ వంటి ప్రయోజనాలను ఈ టెక్నాలజీ అందించవచ్చని టెక్ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి.
ఇదే టెక్నాలజీని యాపిల్ తన రాబోయే బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రా లో ఉపయోగించనున్నట్లు గతంలో పలు నివేదికలు వెలువడ్డాయి. దీంతో iQOO 16లోని డిస్‌ప్లే టెక్నాలజీపై ఆసక్తి పెరుగుతోంది. అయితే iQOO లేదా సామ్ సంగ్ ఇప్పటివరకు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.
డిజైన్‌లోనూ భారీ మార్పులు?
iQOO 16కు సంబంధించినట్లు చెబుతున్న కొన్ని రెండర్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. వీటి ప్రకారం ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్‌ను పూర్తిగా రీడిజైన్ చేసే అవకాశం ఉంది. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు, ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్‌పై మెటల్ తరహా కొత్త ప్యాటర్న్‌ను తీసుకురావచ్చని తెలుస్తోంది. కింది భాగంలో మధ్యలో iQOO బ్రాండింగ్ ఉండనుంది. పవర్, వాల్యూమ్ బటన్లు కుడివైపు ఉండే అవకాశం ఉంది.
స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రోతో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్?
ఇక పనితీరు విషయంలోనూ iQOO 16 అంచనాలను పెంచుతోంది. V2606A మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ Geekbenchలో కనిపించినట్లు సమాచారం. ఇందులో ఇంకా అధికారికంగా విడుదల కాని క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 6 ప్రో చిప్‌సెట్ ఉండనున్నట్లు లీక్ చెబుతోంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 5.01GHz క్లాక్ స్పీడ్ అందించవచ్చని తెలుస్తోంది.
అదే సమయంలో ఈ ఫోన్ Android 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో బెంచ్‌మార్క్‌లో కనిపించినట్లు సమాచారం. దీంతో iQOO 16 డిస్‌ప్లే మాత్రమే కాకుండా ప్రాసెసింగ్ పవర్ విషయంలోనూ హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్‌లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే.. సామ్ సంగ్ కొత్త OLED టెక్నాలజీ, LEAD డిస్‌ప్లే, పవర్‌ఫుల్ Snapdragon చిప్‌సెట్, రీడిజైన్ చేసిన కెమెరా మాడ్యూల్ వంటి ఫీచర్లతో iQOO 16 ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌గా మార్కెట్‌లోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇవన్నీ లీకులు, అంచనాల స్థాయిలోనే ఉన్నాయి. అధికారిక లాంచ్ సమయంలో iQOO ప్రకటించే స్పెసిఫికేషన్లతోనే పూర్తి వివరాలు స్పష్టమవుతాయి.