IQ OO 16 unboxing & first look: స్నాప్ డ్రాగన్ 8 ఎక్స్ ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్ తో ఫ్లాగ్ షిప్ మార్కెట్లోకి వచ్చింది IQ OO 16.. భారీ బ్యాటరీ.. సూపర్ స్మూత్ డిస్ ప్లే.. ప్రత్యేక గేమింగ్ చిప్ తో ఆకట్టుకునే ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.
టెక్ ప్రపంచంలో ఆసక్తి
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో గేమింగ్ ఫోన్లకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న IQ OO 16 సంస్థ.. తన కొత్త ఫ్లాగ్ షిప్ మోడల్ IQ OO 16 తో టెక్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. శక్తివంతమైన ప్రాసెసర్, 2k Resolution తో 165 Hz రీ ఫ్రెష్ రేట్ కలిగిన డిస్ ప్లే, ఏకంగా 8, 400 mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఈ ఫోన్ కు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. చైనాలో ఈ ఫోన్ విడుదలైంది. మనదేశంలో కూడా తీసుకువచ్చేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. అయితే మన దేశ మార్కెట్లో ధర.. విక్రయాల ప్రారంభ తేదీ పై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
డిజైన్ ఎలా ఉందంటే
IQ OO 16 వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్ డిజైన్ పూర్తిగా మార్చేశారు. కొత్త లుక్ తీసుకొచ్చారు. ఆకర్షణ ఏమైనా బ్యాక్ ప్యానెల్ ఉంది పనితీరుకు ప్రాధాన్యమిచ్చే యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఫ్లాగ్ షిప్ స్థాయి హార్డ్వేర్ ఇందులో అమర్చారు.
పవర్ఫుల్ ప్రాసెసర్
ఈ ఫోన్లో Qualcomm స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్ ను అమర్చారు. దీనికి తోడు IQ OO ప్రత్యేక క్యూ4 గేమింగ్ చిప్ ఏర్పాటు చేసింది. గేమింగ్ సమయంలో గ్రాఫిక్స్.. టచ్ స్పందన.. పరి తీరును మెరుగుపరచడంలో ఈ కాంబినేషన్ అద్భుతమైన పాత్ర పోషించబోతోంది. భారీగా గేమ్స్ ఆడేవారు.. ఒకేసారి అన్ని యాప్స్ ఉపయోగించేవారు.. అధికంగా పనితీరు కోరుకునే వారికి ఈ ఫోన్ ఆసక్తికరమైన ఎంపిక కావచ్చు. దీర్ఘకాలిక గేమింగ్లో ఫోన్ టెంపరేచర్.. బ్యాటరీ.. వంటి వాటిపై పూర్తి ఫలితాలు రావాల్సి ఉంది.
2k Resolution
IQ OO 16 లో 6.85 అంగుళాల Samsung M 16 AMOLED display అందించారు..2K Resulation తో పాటు 165 Hz రీ ఫ్రెష్ రేట్ ఈ ఫోన్లో ఉంటుంది.. అత్యధిక రీ ఫ్రెష్ రేట్ వల్ల సపోర్ట్ చేసే గేమ్స్ కదలికలు.. మరింత స్మూత్ గా కనిపించవచ్చు. అలాగే అధిక Resolution తో వీడియోలు, ఫోటోలు, ఇతర కంటెంట్ స్పష్టంగా వీక్షించవచ్చు.
8,400 mAh battery చార్జింగ్ ఎలా
సాధారణ ఫ్లాగ్ షిప్ ఫోన్లతో పోలిస్తే భారీగా ఉండే 8,400 mAh బ్యాటరీ IQ OO 16 లో మరో ప్రధాన ఆకర్షణ. ఎక్కువసేపు గేమ్ చేసేవారు.. వీడియోలు చూసేవారు.. ప్రయాణంలో ఫోన్ ఎక్కువగా ఉపయోగించే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫోన్లో 100 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అయితే పూర్తి చార్జింగ్ కు పట్టే సమయం.. బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుంది అనేది వినియోగించే విధానం.. స్క్రీన్ బ్రైట్నెస్.. నెట్వర్క్ పరిస్థితుల వంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
కెమెరాలు కూడా
IQ OO 16 లో వెనుకవైపు మూడు 50 మెగా పిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన కెమెరాతో పాటు ఆల్ట్రా వైడ్, పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు.. వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు. ఈ కెమెరా సెట్ అప్ ద్వారా సాధారణ ఫోటోగ్రఫీతో పాటు వైడ్ యాంగిల్ ఫోటోలు.. దూరంలోని వస్తువులను జూమ్ చేసి చిత్రీకరించడం వంటి అవసరాలు తీర్చుకోవచ్చు. అయితే భారత మార్కెట్లో విడుదల వేరియంట్ లో కెమెరా స్పెసిఫికేషన్లు మారుతాయా అనే అంశం మీద అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
మన దేశంలో విడుదల ఎప్పుడంటే..
ఈ ఫోన్ చైనాలో 5,999 యోన్ లకు విక్రయిస్తున్నారు. మన దేశ కరెన్సీ లో ఇది 86 వేల వరకు ఉండొచ్చు. అయితే నేరుగా మన దేశం మార్కెట్ ధర కాదు. దిగుమతి.. పన్నులు.. ఇతర ఖర్చులు వంటి వాటిని కలుపుకుంటే ధర ఎక్కువగా ఉండొచ్చు. మనదేశంలోకి ఈ మోడల్ వస్తుందని కంపెనీ అధికారికంగా ధ్రువీకరించినప్పటికీ.. ఖచ్చితమైన లాంచ్ తేదీ.. ధర.. వేరియంట్.. వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.