Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Vishwambhara release date: చిరంజీవి విశ్వంభర సమ్మర్ లో కూడా రానట్టేనా..?

Chiranjeevi Vishwambhara release date: చిరంజీవి విశ్వంభర సమ్మర్ లో కూడా రానట్టేనా..?

Chiranjeevi Vishwambhara release date: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఎక్కడా తగ్గకుండా డ్యాన్స్ లు చేస్తూ ఫైటింగ్ సన్నివేశాల్లో డూప్ లేకుండా చేస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు యంగ్ హీరోలు సైతం చిరంజీవిని చూసి కుళ్ళుకుంటున్నారు అంటే ఆయన సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు… అలాంటి […]

Chiranjeevi Vishwambhara release date: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఎక్కడా తగ్గకుండా డ్యాన్స్ లు చేస్తూ ఫైటింగ్ సన్నివేశాల్లో డూప్ లేకుండా చేస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు యంగ్ హీరోలు సైతం చిరంజీవిని చూసి కుళ్ళుకుంటున్నారు అంటే ఆయన సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు… అలాంటి చిరంజీవి ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. గత మూడు సంవత్సరాల క్రితమే వశిష్ట డైరెక్షన్లో స్టార్ట్ అయిన ‘విశ్వంభర’ సినిమా ఇప్పటివరకు ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు…

ఈ సంవత్సరం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పినప్పటికి రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన క్లారిటీని ఇస్తారా? సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతోంది ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనే అంశాలు సైతం మెగా అభిమానులను వెంటాడుతున్నాయి.

Also Read: నిరాశపరుస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ‘ఓజీ’ తర్వాత ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు!

ఇక సీజీ వర్క్ మీద దర్శకుడు, హీరో ఇద్దరు సాటిస్ఫైడ్ గా లేరని అందువల్లే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుందంటూ సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సమ్మర్ మిస్ అయితే మాత్రం విశ్వంభర సినిమా ఇంకెప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి అర్థం కానీ పరిస్థితి రాబోతోంది. ఇక ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు.

కాబట్టి మెగా అభిమానులు కొంతవరకు హ్యాపీగా ఉన్నారు. ఇక వచ్చేనెల ‘పెద్ది’ సినిమాతో రామ్ చరణ్ సైతం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘విశ్వంభర’ సినిమా కూడా వస్తే మెగా అభిమానులు చాలా సాటిస్ఫైడ్ గా ఉంటారని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper