Homeబిజినెస్Hey Jio AI Feature: జియో మరో సంచలనం.. అందుబాటులోకి AI ఫీచర్.. ఎవరికి ఉపయోగమంటే..

Hey Jio AI Feature: జియో మరో సంచలనం.. అందుబాటులోకి AI ఫీచర్.. ఎవరికి ఉపయోగమంటే..

Hey Jio AI Feature: దేశంలో టెలికాం రంగంలో సంచలన మార్పులకు నాంది పలికిన జియో మరో కీలక అడుగు వేయబోతోంది. ఇటీవల జరిగిన రిలయన్స్ AGM (Annual General Meeting)లో తమ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన AI ఆధారిత కాలింగ్ అసిస్టెంట్ ఫీచర్‌ను ప్రకటించింది. ఈ సదుపాయం ద్వారా ప్రత్యేక యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే కాల్ సమయంలోనే AI సేవలను పొందే అవకాశం కలగనుంది. దీంతో జియో యూజర్లకు ఇది చాలా వరకు […]

Hey Jio AI Feature: దేశంలో టెలికాం రంగంలో సంచలన మార్పులకు నాంది పలికిన జియో మరో కీలక అడుగు వేయబోతోంది. ఇటీవల జరిగిన రిలయన్స్ AGM (Annual General Meeting)లో తమ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన AI ఆధారిత కాలింగ్ అసిస్టెంట్ ఫీచర్‌ను ప్రకటించింది. ఈ సదుపాయం ద్వారా ప్రత్యేక యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే కాల్ సమయంలోనే AI సేవలను పొందే అవకాశం కలగనుంది. దీంతో జియో యూజర్లకు ఇది చాలా వరకు ఉపయోగపడనుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఈ ఏఐ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..

జియో యూజర్లకు అందుబాటులోకి వచ్చరే ఈ కొత్త ఫీచర్‌లో వినియోగదారుడు కాల్‌లో ఉండగానే ‘Hey Jio’ అని పలికితే AI ఏజెంట్ యాక్టివేట్ అవుతుంది. ఆ తరువాత వాయిస్ కమాండ్ల ద్వారా వివిధ పనులను నిర్వహించవచ్చు. దీంతో ఫోన్‌లో వేరే యాప్‌లు ఓపెన్ చేయకుండానే అనేక సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి.ప్రత్యేకంగా కాల్ ముగిసిన తర్వాత మొత్తం సంభాషణకు సంబంధించిన సమ్మరీని AI సిద్ధం చేసి ఇస్తుంది. సమావేశాలు, వ్యాపార చర్చలు లేదా ముఖ్యమైన కాల్స్ చేసినప్పుడు ప్రధాన అంశాలను గుర్తుంచుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వివిధ భారతీయ భాషల్లో కాల్ సారాంశాన్ని అందించే సామర్థ్యాన్ని కూడా జియో తీసుకురానుంది.

కేవలం కాల్ సమ్మరీలకే పరిమితం కాకుండా, క్యాబ్ బుకింగ్, ఫుడ్ ఆర్డరింగ్, రిమైండర్లు సెట్ చేయడం, సమాచారం సేకరించడం వంటి అనేక పనులను కూడా ఏఐ ఏజెంట్ నిర్వహించగలదని కంపెనీ తెలిపింది. అంటే కాల్‌లో మాట్లాడుతూనే వినియోగదారులు తమ రోజువారీ అవసరాలను పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సాంకేతికతతో జియో వినియోగదారులకు మరింత సులభమైన, వేగవంతమైన డిజిటల్ అనుభవాన్ని అందించాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సాధారణ మొబైల్ వినియోగదారులకు దగ్గర చేయడంలో ఈ ఫీచర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉండగా, 2026 సంవత్సరం చివరి నాటికి ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అధికారిక విడుదల తేదీపై జియో త్వరలో మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. జియో ప్రవేశపెట్టబోతున్న ఈ AI కాలింగ్ అసిస్టెంట్ విజయవంతమైతే, భారత టెలికాం రంగంలో కొత్త ట్రెండ్‌కు నాంది పలికే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. AI సేవలను నేరుగా మొబైల్ కాల్స్‌తో అనుసంధానం చేయడం ద్వారా డిజిటల్ కమ్యూనికేషన్‌లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశముంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper