Homeబిజినెస్Best Electric Scooters Under 45000: ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా.. రూ. 45 వేల లోపు...

Best Electric Scooters Under 45000: ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా.. రూ. 45 వేల లోపు లభించే మోడల్స్ ఇవే..

Best Electric Scooters Under 45000: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, రోజువారీ ఆఫీస్ లేదా కాలేజీ ప్రయాణాలు చేసేవారు బడ్జెట్ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే ఈ-స్కూటర్ల కోసం వెతుకుతున్నారు. ఇలాంటి వారికి కొన్ని కంపెనీలు తక్కవ ధరకే ఈ స్కూటర్లను అందించేందుకు సిద్ధంగాఉన్నాయి. ముఖ్యంగా రూ. 45 వేల బడ్జెట్ పరిమితిలో కొన్ని కంపెనీలు వీటిని అందిస్తున్నాయి. ఆ కంపెనీలు ఏవో చూద్దాం.. కొమాకి ఎక్స్-వన్ : […]

Best Electric Scooters Under 45000: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, రోజువారీ ఆఫీస్ లేదా కాలేజీ ప్రయాణాలు చేసేవారు బడ్జెట్ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే ఈ-స్కూటర్ల కోసం వెతుకుతున్నారు. ఇలాంటి వారికి కొన్ని కంపెనీలు తక్కవ ధరకే ఈ స్కూటర్లను అందించేందుకు సిద్ధంగాఉన్నాయి. ముఖ్యంగా రూ. 45 వేల బడ్జెట్ పరిమితిలో కొన్ని కంపెనీలు వీటిని అందిస్తున్నాయి. ఆ కంపెనీలు ఏవో చూద్దాం..

కొమాకి ఎక్స్-వన్ :
ఈ బడ్జెట్‌లో గ్రాఫేన్ (Graphene) బ్యాటరీ టెక్నాలజీతో వస్తున్న పాపులర్ మోడల్ ఇది. దీనికి యాంటీ-థెఫ్ట్ అలారం , ఎల్‌ఈడీ లైటింగ్ , మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటి మంచి ఫీచర్లు ఉన్నాయి. కాలేజీ విద్యార్థులకు, ఇళ్లకు దగ్గర్లోని మార్కెట్ పనులకు ఇది చాలా చక్కగా సరిపోతుంది. దీని ధర: సుమారు రూ. 35,000 – రూ. 38,000 (ఎక్స్-షోరూమ్). ఒకసారి ఛార్జ్ చేస్తే 60 నుండి 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

యాకుజా రూబీ / న్యూ :
స్టైలిష్ తో పాటు లేటేస్ట్ డిజైన్‌ కోరుకునేవారికి ఈ స్కూటర్ బెస్ట్ ఎంపిక. ఇది చూసేందుకు కాంపాక్ట్‌గా ఉంటుంది. బరువు తక్కువగా ఉండటం వల్ల మహిళలు, వృద్ధులు సిటీ ట్రాఫిక్‌లో చాలా సులువుగా నడపడానికి ఇది వీలు కల్పిస్తుంది. దీని ఛార్జింగ్ సమయం 6 నుండి 8 గంటలు పడుతుంది. సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 55 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్లొచ్చు. దీనిని రూ. 38,000 (ఎక్స్-షోరూమ్) నుంచి విక్రయిస్తున్నారు.

ఉజాస్ ఈగో ఎల్ఏ:
తక్కువ ధరలో ఎక్కువ కాలంగా మార్కెట్లో నమ్మకంగా ఉన్న మోడల్ ఇది. ఇందులో ట్యూబ్‌లెస్ టైర్లు, డిజిటల్ స్పీడోమీటర్ , అల్లాయ్ వీల్స్ వస్తాయి. దీని మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువ. దీని ధర రూ. 35,000 – రూ. 40,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 60 నుండి 75 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చు.

జెలియో ఈవా ఎకో ఎల్ఎక్స్:
రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు చేసే వారికి ఇది ఒక మంచి ఆప్షన్. ఇందులో సెంటర్ లాకింగ్ సిస్టమ్, కీ-లెస్ డ్రైవ్, యూఎస్‌బీ పోర్ట్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేయడం ద్వారా 60 నుంచి 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ధర రూ. 43,500 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

అయితే రూ. 45 వేల లోపు లభించే స్కూటర్లలో ఎక్కువ శాతం లెడ్-యాసిడ్ (Lead-Acid) బ్యాటరీలు ఉంటాయి. వీటికి కంపెనీలు సాధారణంగా 1 సంవత్సరం వారంటీ మాత్రమే ఇస్తాయి. ఒకవేళ మీ బడ్జెట్‌ను పెంచుకుంటే మరింత ఎక్కువ కాలం మన్నిక వచ్చే లిథియం-అయాన్ బ్యాటరీ స్కూటర్లు లభిస్తాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper