Homeఆంధ్రప్రదేశ్‌Vallabhaneni Vamsi: పాపం వల్లభనేని వంశీ.. జగన్ సమక్షంలో ఎంత దుస్థితి వచ్చింది.. వైరల్ వీడియో

Vallabhaneni Vamsi: పాపం వల్లభనేని వంశీ.. జగన్ సమక్షంలో ఎంత దుస్థితి వచ్చింది.. వైరల్ వీడియో

Vallabhaneni Vamsi: రాజకీయ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి వైఖరి భిన్నంగా ఉంటుంది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన దిట్ట. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని కీలక నిర్ణయాల్లో ఆయనే సర్వాధికారిగా వ్యవహరిస్తుంటారు. నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఇతరుల విషయంలో ఆయన వ్యవహరించే తీరు ఏకపక్షంగానే ఉంటుంది. తన పార్టీలో తన తండ్రి రాజశేఖరరెడ్డి సమకాలీకులు కూడా ఉన్నారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ.. ఇప్పుడు ప్రతిపక్షంలో మారిన తర్వాత కూడా గౌరవ హోదాలు కల్పించడంలో తనదైన […]

Vallabhaneni Vamsi: రాజకీయ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి వైఖరి భిన్నంగా ఉంటుంది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన దిట్ట. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని కీలక నిర్ణయాల్లో ఆయనే సర్వాధికారిగా వ్యవహరిస్తుంటారు. నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఇతరుల విషయంలో ఆయన వ్యవహరించే తీరు ఏకపక్షంగానే ఉంటుంది. తన పార్టీలో తన తండ్రి రాజశేఖరరెడ్డి సమకాలీకులు కూడా ఉన్నారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ.. ఇప్పుడు ప్రతిపక్షంలో మారిన తర్వాత కూడా గౌరవ హోదాలు కల్పించడంలో తనదైన శైలితో ముందుకు వెళుతుంటారు. ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యం ఇవ్వాలో.. ఎప్పుడు ప్రాధాన్యం తగ్గించాలో ఆయనకు తెలిసినట్టుగా మరి ఎవరికీ తెలియదు. ఆయన ఉచ్చులో చిక్కుకున్న వారు బయటకు రావడం కష్టం. అంతలా వారిపై వివాదాస్పద ముద్రపడేలా చేయగలరు. ఇప్పుడు వల్లభనేని వంశీ మోహన్ పరిస్థితి కూడా అదే. ఆయన తనపై ఉన్న వివాదాస్పద ముద్రతో మరో పార్టీలోకి వెళ్ళలేరు. ఇతర పార్టీ వారు తీసుకోరు కూడా.

* వైసీపీలోకి ఫిరాయింపు..
2019 ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచారు వల్లభనేని వంశీ మోహన్. కొద్ది రోజులకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అయితే వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ మోహన్ తో జగన్మోహన్ రెడ్డి ఎన్ని వ్యాఖ్యలు చేయించాలో అన్ని చేయించారు చంద్రబాబు, లోకేష్ లపై. అందుకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు వల్లభనేని వంశీ. పోనీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైనా స్వాంతన లభిస్తుంది అనుకుంటే.. తన సొంత నియోజకవర్గం గన్నవరంలో ప్రాధాన్యత లేని నాయకుడిగా మారిపోతున్నారు వంశీ. అయితే ఇటీవల వంశీ విషయంలో జగన్ వైఖరి మారుతున్నట్టు కొన్ని సందర్భాలు తెలియజేస్తున్నాయి.

* నో అపాయింట్మెంట్..
జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలుసుకోవాలంటే వల్లభనేని వంశీకి కుదిరే పని కాదన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. వ్యక్తిగతంగా కలిసేందుకు ఆయనకు అపాయింట్మెంట్ లభించడం లేదన్నది ఆ పార్టీ వర్గాల్లో ఉన్న టాక్. తన వారాంతపు షెడ్యూల్లో భాగంగా తాడేపల్లి వస్తుంటారు జగన్మోహన్ రెడ్డి. అది కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ ద్వారానే. అయితే జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు అవకాశం దొరకకపోవడంతో వంశి ఎయిర్పోర్ట్ వద్ద వేచి చూడడం కనిపించింది. ఇతర పార్టీ నేతలు మాదిరిగా వంశీ బారికేడ్ల అవతల నిలబడాల్సి వస్తోంది. కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి దూరం నుంచి మాట్లాడి వెళ్లిపోతున్న వీడియోలు, దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్నాయి. 2024 కు ముందు ఎప్పుడు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలుసుకునే అవకాశం ఉండేది వల్లభనేని వంశీకి. కానీ ఇప్పుడు గన్నవరంలోనూ వంశీ జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే వీలు చిక్కడం లేదు. ఇది వంశీ ఆలోచించుకోవాల్సిన విషయమే. జగన్మోహన్ రెడ్డి లో ఈ తరహా వైఖరి ఉంటే మాత్రం.. అది కచ్చితంగా వదిలించుకోవడానికి అనే టాక్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇక తేల్చుకోవాల్సింది వల్లభనేని వంశీ మాత్రమే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper