Ather Konarc: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను వాడే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ తరహా ద్విచక్ర వాహనాల తయారీలోకి పెద్ద పెద్ద పరిశ్రమలు అడుగుపెడుతున్నాయి. కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ సెగ్మెంట్లో ఏథర్ అనే కంపెనీ కోణార్క్ పేరుతో ఒక స్కూటర్ ను తీసుకువచ్చింది.
కోణార్క్ స్కూటర్ ఎస్, జెడ్ అనే వేరియంట్లలో లభించబోతోంది. దీని ప్రారంభ ధర లక్ష వరకు ఉంది. ఎస్ వేరియంట్ లో మొత్తం నాలుగు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. బ్యాటరీ పరంగా చూసుకుంటే దీనిని బాహుబలి అని పిలవచ్చు. సీటింగ్ సామర్థ్యం కూడా బ్రహ్మాండంగా ఉంది.. ముఖ్యంగా నేటి తరానికి అవసరమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చి దీనిని రూపొందించారు.
S100 వేరియంట్ లో సింగిల్ ఛార్జ్ ద్వారా 100 కిలోమీటర్ల వరకు ప్రయాణం సాగించవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 2.1 kWh..
2.7 kWh, 3.5k Wh బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉన్న వేరియంట్లలో 125 కిలోమీటర్లు(ఐడిసి), 161 కిలోమీటర్లు (ఐడీసీ) రేంజ్ ఇస్తాయి.
ఈ మోడల్స్ హై స్పీడ్ గంటకు 70 కిలోమీటర్లు. కోణార్క్ 450w ఆన్ బోర్డ్ చార్జర్ తో వస్తుంది. దీనిని 900 w ఆఫ్ బోర్డు చార్జర్ కు అనుసంధానించవచ్చు. మొత్తంగా 1.35kW చార్జింగ్ సామర్ధ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక ఇంటి వద్ద సున్నా నుంచి 8% ఛార్జ్ చేసేందుకు ఎస్ 100 వేరియంట్ కు దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. ఎస్ 125 కి నాలుగు గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. యస్ 161 కు ఐదు గంటల 40 నిమిషాల వరకు సమయం పడుతుంది.
కంబైండ్ చార్జర్ గనుక ఉపయోగిస్తే ఆ సమయం సగానికి సగం తగ్గుతుంది. కేవలం పది నిమిషాలు చార్జ్ చేస్తే 13 కిలోమీటర్ల వరకు ప్రయాణం సాగించవచ్చు. ఎస్ అనే వేరియంట్ లో 200 కిలోమీటర్ల దూరం రేంజ్ ఇచ్చే మరో స్కూటర్ కూడా తీసుకు వస్తున్నట్టు ఏథర్ కంపెనీ వెల్లడించింది.
ఈ మోడల్ లో అనేక మార్పులను ఏథర్ కంపెనీ చేపట్టింది. సర్వీస్ సెంటర్లలో టెక్నీషియన్ సమయాన్ని ఆదా చేసేందుకు ఈ మార్పులు చేసింది. ఫీల్డ్ లెవెల్ లో కంపెనీ వాహనాల 26 లక్షల కిలోమీటర్ల సమాచారాన్ని విశ్లేషించి.. వినూత్నమైన ఛాసిస్.. పవర్ ట్రైన్.. ఎలక్ట్రానిక్స్ ఆర్కిటెక్చర్ తో దీనిని రూపొందించింది. విడిభాగాల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి.. సర్వీసింగ్ చేసే సమయాన్ని మరింత ఆదా చేసింది. ఒకవేళ ఎక్స్పర్ట్ టెక్నీషియన్ అయితే ఈ కంపెనీ స్కూటర్ లో బ్యాటరీ కేవలం మూడు నిమిషాల్లోనే విడదీసి.. బిగించే విధంగా రూపొందించారు.
కోణార్క్ కెపాసిటీ 31 లీటర్లు. 18 డబ్ల్యూ యుఎస్బి టైపు సి పోర్ట్.. అండర్ సీట్ ల్యాంప్.. ఎస్ 100 వేరియంట్ కు 4.2 అంగుళాల డిస్ప్లే.. మిగిలిన బతికి సెవెన్ అంగుళాల డిస్ప్లే ఇచ్చారు.. ఆటో హోల్డ్.. పార్క్ అసిస్ట్ రివర్స్.. వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
కోణార్క్ జెడ్ వేరియెంట్లో అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టం ద్వారా వస్తుంది. అలాగే దీనికి మేజిక్ కీ కూడా ఇవ్వబోతున్నారు. స్కూటర్ లాక్.. అన్ లాక్ ను యాప్ ద్వారా ఉపయోగించవచ్చు.. వాట్సప్.. google map ను జెడ్ వేరియెంట్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. దొంగల నుంచి రక్షణ.. రైడ్ స్టాటిస్టిక్స్.. ఫైండ్ మై స్కూటర్.. చార్జింగ్ పర్యవేక్షణ.. ఓటి ఏ అప్డేట్స్ వంటి వాటిని జన్ జెడ్ వేరియంట్ సపోర్ట్ చేస్తుంది.