Homeబిజినెస్Bank Penalty Charges India: ఖాతాదారుల నుంచి బ్యాంకులు లాక్కున్న సొమ్ము అక్షరాల రూ.26,170 కోట్లు

Bank Penalty Charges India: ఖాతాదారుల నుంచి బ్యాంకులు లాక్కున్న సొమ్ము అక్షరాల రూ.26,170 కోట్లు

Bank Penalty Charges India: బ్యాంకులు మన డబ్బులను జాగ్రత్తపర్చడంతోపాటు డిపాజిట్లకు వడ్డీ కూడా చెల్లిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా మన అవసరాలకు రుణాలు ఇస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయి. ఇదే సమయంలో బ్యాంకు ఖాతాల్లో నిర్ణీత కనీస నిల్వ ఉంచకపోవడంతో పెనాల్టీలు కూడా వసూలు చేస్తున్నాయి. వ్యక్తిగతంగా విధించే ఫైన్‌ చిన్నగా అనిపించినా.. అది బ్యాంకులకు పెద్ద మొత్తంలో ఆదాయంగా మారుతోంది. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్ర మంత్రే స్వయంగా వెల్లడించారు. నాలుగేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఏకంగా […]

Bank Penalty Charges India: బ్యాంకులు మన డబ్బులను జాగ్రత్తపర్చడంతోపాటు డిపాజిట్లకు వడ్డీ కూడా చెల్లిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా మన అవసరాలకు రుణాలు ఇస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయి. ఇదే సమయంలో బ్యాంకు ఖాతాల్లో నిర్ణీత కనీస నిల్వ ఉంచకపోవడంతో పెనాల్టీలు కూడా వసూలు చేస్తున్నాయి. వ్యక్తిగతంగా విధించే ఫైన్‌ చిన్నగా అనిపించినా.. అది బ్యాంకులకు పెద్ద మొత్తంలో ఆదాయంగా మారుతోంది. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్ర మంత్రే స్వయంగా వెల్లడించారు. నాలుగేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఏకంగా రూ.26,170.37 కోట్లు వసూలు పెనాల్టీ రూపంలో బ్యాంలు వసూలు చేసినట్లు తెలిపారు.

నాలుగేళ్ల వసూళ్లు భారీగా పెనాల్టీ..
నాలుగేళ్ల కాలంలో బ్యాంకులు మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేని ఖాతాలపై పెనాల్టీ రూపంలో భారీగా వసూలు చేశాయి. రూ.26 వేల కోట్లకు పైగా ఉన్న ఈ మొత్తం బ్యాంకింగ్‌ రంగం ఫీజు ఆధారిత ఆదాయాన్ని భారీగా పెంచింది. అయితే ఇది ఎక్కువగా తక్కువ ఆదాయం ఉన్న వర్గాలు, గ్రామీణ ఖాతాదారులు, చిన్న ఉద్యోగులు లేదా పెన్షనర్లు వంటి వారి ఖాతాల నుంచే వస్తోంది. ఫలితంగా బ్యాంకులు లాభపడుతున్నప్పటికీ, వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.

2026 ఆర్థిక సంవత్సరంలో ఇలా..
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.2,137.92 కోట్లు, ప్రైవేట్‌ బ్యాంకులు రూ.4,948.71 కోట్లు పెనాల్టీ వసూలు చేశాయి. ప్రైవేట్‌ బ్యాంకుల వసూళ్లు ప్రభుత్వ బ్యాంకుల కంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇది ప్రైవేట్‌ బ్యాంకులు మినిమమ్‌ బ్యాలెన్స్‌ నిబంధనలను ఎంత కఠినంగా అమలు చేస్తున్నాయో సూచిస్తుంది. ఈ ఏడాది ఎస్‌బీఐ ఒక్కటే రూ.477.27 కోట్లు వసూలు చేసి ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచింది. పెద్ద కస్టమర్‌ బేస్‌ ఉన్న బ్యాంకు కావడంతో ఈ సంఖ్య సహజంగానే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇది ఎస్‌బీఐ వంటి పెద్ద బ్యాంకులు కూడా ఫీజు ఆదాయంపై ఆధారపడుతున్నట్లు కనిపిస్తోంది.

ఖాతాదారులపై ప్రభావం..
మినిమమ్‌ బ్యాలెన్స్‌ పెనాల్టీలు బ్యాంకులకు స్థిరమైన ఆదాయ మార్గం అయినప్పటికీ, ఇవి ఆర్థిక లక్ష్యాలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. చాలా మంది ఖాతాదారులు జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు లేదా తక్కువ నిల్వతోనే నిర్వహించాల్సి వస్తోంది. పెనాల్టీలు పడిన ప్రతిసారీ ఖాతా నిల్వ మరింత తగ్గి, మళ్లీ పెనాల్టీ చెల్లించాల్సి వస్తోంది. చాలా మందికి తెలియకుండా డబ్బులను బ్యాంకులు ఖాతాల నుంచి జమ చేసుకుంటున్నాయి. బ్యాంకులు తమ ఖర్చులను భర్తీ చేసుకోవాలనే ఆర్‌బీఐ నిబంధన ఉన్నప్పటికీ, ఈ స్థాయి వసూళ్లు ఖాతాదారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

మినిమమ్‌ బ్యాలెన్స్‌ పెనాల్టీలు బ్యాంకుల ఆదాయాన్ని పెంచుతున్నాయి కానీ వినియోగదారులపై అనవసర భారం వేస్తున్నాయి. భవిష్యత్తులో ఈ చార్జీలను తగ్గించడం, జీరో బ్యాలెన్స్‌ ఖాతాలను ప్రోత్సహించడం లేదా పెనాల్టీలకు గరిష్ట పరిమితి విధించడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ వసూళ్లు కేవలం బ్యాంకుల లాభాలకే పరిమితమై, సాధారణ ప్రజల ఆర్థిక భద్రతను దెబ్బతీస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper