Homeబిజినెస్Bajaj Pulsar n 160 SS : పనితీరు.. ఫీచర్లు.. ధరల శ్రేణి.. ఫుల్ డీటెయిల్స్...

Bajaj Pulsar n 160 SS : పనితీరు.. ఫీచర్లు.. ధరల శ్రేణి.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం

Bajaj Pulsar n 160 SS : మనదేశంలో ద్విచక్ర వాహనాల తయారీలో బజాజ్ కంపెనీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఈ కంపెనీలో ఎన్నో ప్రముఖమైన బ్రాండ్లు ఉన్నప్పటికీ పల్సర్ ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. బజాజ్ పల్సర్ సరిగా 2001లో లాంచ్ అయింది. 2026 నాటికి మార్కెట్లోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఈ మోడల్ లో బజాజ్ అనేక రకాల మార్పులు చేపట్టి.. సరికొత్తగా బజాజ్ పల్సర్ ఎన్ 160 […]

Bajaj Pulsar n 160 SS : మనదేశంలో ద్విచక్ర వాహనాల తయారీలో బజాజ్ కంపెనీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఈ కంపెనీలో ఎన్నో ప్రముఖమైన బ్రాండ్లు ఉన్నప్పటికీ పల్సర్ ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.

బజాజ్ పల్సర్ సరిగా 2001లో లాంచ్ అయింది. 2026 నాటికి మార్కెట్లోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఈ మోడల్ లో బజాజ్ అనేక రకాల మార్పులు చేపట్టి.. సరికొత్తగా బజాజ్ పల్సర్ ఎన్ 160 ఎస్ఎస్ మోడల్ ను తీసుకొచ్చింది. కేవలం కొత్త స్టికర్ .. డిజైన్ విషయంలోనే కాదు చాలా వాటిల్లో బజాజ్ తన మార్పును చూపించింది. ఇందులో ఫోర్ వాల్వ్ ఇంజన్ ఉంది. కొన్ని కొత్త ఎలక్ట్రానిక్స్ ఫీచర్లను జత చేసింది. స్పెసిఫికేషన్ విషయంలో కూడా ఏమాత్రం రాజీపడలేదు. కొత్త గ్రాఫిక్స్.. బ్లాక్ ఫినిష్.. రెడ్ యాక్సెంట్ లు దీనికి సరికొత్త స్పోర్ట్స్ లుక్ తీసుకొచ్చాయి.

ఇందులో 5 అంగుళాల టిఎఫ్టి డిస్ప్లే ఉంది. ఇది పాత కన్సోల్ కంటే కూడా ప్రీమియంలాగా కనిపిస్తోంది. బ్లూటూత్… వైఫై కనెక్టివిటీ.. మ్యూజిక్ కంట్రోల్స్.. గూగుల్ మ్యాప్స్ మిర్రర్ వంటి ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. నావిగేషన్ ఫీచర్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. 18.5 పిఎస్, 14.4 ఎంఎం శక్తిని ఉత్పత్తి చేసే కొత్త 164.9 సిసి, ఫోర్ వాల్ ఇంజన్ నుంచి వచ్చే పవర్ 5 స్పీడ్ గేర్ బాక్స్ ఈ మోడల్ కి ఉన్న అడ్వాంటేజ్. పాత బైక్ లో 33mm యూనిట్లకు బదులుగా ఇందులో దృఢమైన 37 ఎంఎం ఆఫ్ సైడ్ డౌన్ ఫోర్క్ లు.. 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్.. డ్యూయల్ ఏబీఎస్ ఇందులో ఉన్నాయి

ఈ మోడల్ లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. దీనివల్ల తడి లేదా జారే ఉపరితలం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు బైక్ స్కిడ్ కాకుండా ఉంటుంది. నగరంలో ఈ బైక్ ను సులభతరంగా డ్రైవింగ్ చేయడానికి ట్రావెల్ మోడ్ కూడా ఉంది. సులభంగా సర్దుబాటు చేయడానికి క్లచ్, బ్రేక్ లివర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ మోడల్ లో రెయిన్, రోడ్డు, స్పోర్ట్స్ అనే మోడల్స్ ఉన్నాయి. వీటితోపాటు ఆఫ్ రోడ్ మోడ్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఇది ఎగుడు దిగుడు ఉన్న ప్రాంతాలలో ఉన్నప్పుడు బ్రేకింగ్ కు తోడ్పడుతుంది. టూరింగ్ మోడ్ విషయానికి వస్తే దానిపై మిర్రర్ అయ్యే గూగుల్ మ్యాప్స్ ను సులభంగా చూసేందుకు డిస్ప్లేలో మార్పులు ఉన్నాయి.

ఎన్ఎస్ 160 ఎస్ఎస్ త్రాటిల్ ను తిప్పినప్పుడు కొత్త ఇంజిన్ చాలా సున్నితంగా. సిద్ధమైనదిగా అనిపిస్తే ఉంటుంది.. మిడ్ రేంజ్ లో యాక్సిలరేటర్ ను గట్టిగా నొక్కితే మోటార్ సైకిల్ ఉత్తేజితమై.. శక్తివంతంగా మారుతుంది. ఇక ఇందులో టాప్ ఎండ్ పనితీరు పాత మోడల్ కంటే మెరుగ్గా ఉంది. దీని ఢిల్లీ ఎక్స్ షోరూం ధర 1,33,511 గా ఉంది. దేశంలోని అనేక నగరాలలో ఈ మోడల్ అందుబాటులో ఉంది. కాకపోతే స్థానిక పన్నులు కలిపి ధరలో కాస్త తేడాలు ఉండవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper