Amazon Flipkart: ఆన్లైన్ వేదికలలో వస్తువుల కొనుగోలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. కేవలం నగరాల మాత్రమే కాకుండా.. మారుమూల గ్రామాలలో కూడా ఆన్లైన్ వేదికలలో వస్తువులను రవాణా చేస్తున్నారు. బలమైన సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న కంపెనీలు.. గంటల వ్యవధిలోని డెలివరీ చేస్తున్నాయి.
సరుకు రవాణా ద్వారా ఆయా సంస్థలు భారీగా లాభాలను సొంతం చేసుకుంటున్నాయి. ఇందులో అమెజాన్.. ఫ్లిప్కార్ట్ ముందు వరుసలో ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ కామర్స్ వేదికల ద్వారా ఈ సంస్థలు చేస్తున్న మోసాలు ఇటీవల కాలంలో వెలుగు చూసాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో 8 ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇవి వచ్చే ఏడాది జనవరి ప్రకటించి అమల్లోకి వస్తాయి.
పారదర్శకత..
వస్తువులు అమ్మే వారి వివరాలు.. ఉత్పత్తి సమాచారం.. అందులో ఉపయోగించిన పదార్థాలు.. ఇతర విషయాలను వినియోగదారులకు అర్థమయ్యే విధంగా వారి సొంత భాషలోనే స్పష్టంగా తెలియజేయాలి. అందులో ఏమైనా హానికారక పదార్థాలు ఉంటే స్పష్టంగా పేర్కొనాలి.. దానివల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం కలుగుతుందో.. అది దేహం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో వివరించాలి.
నకిలీ డిస్కౌంట్లు
ఆఫర్లలో వచ్చే ధరలు నిజమైన కావా నన్ను తెలుసుకోవడానికి గడిచిన 30 రోజుల్లో ఆవు ఉత్పత్తిలో ఉన్న అత్యల్పమైన ధరను కూడా చూపించాలి.. ఒకవేళ ధర ఎందుకు పెంచాల్సి వచ్చిందో కూడా వివరించాలి.
సెర్చ్ రిజల్ట్స్ అండ్ స్పాన్సర్ ప్రొడక్ట్స్
మనం ఏదైనా ఉత్పత్తి కోసం వెతుకుతున్నప్పుడు ఈ కామర్ సంస్థలు సంబంధంలేని ఫలితాలను చూపిస్తూ ఉంటాయి. ఇలాంటి సంబంధం లేని ఫలితాలను చూపించడం ఇకపై కుదరదు. ఒకవేళ స్పాన్సర్ ఉత్పత్తులను చూపించి వినియోగదారులను తప్పుదోవ పట్టించేలాగా వ్యవహరించడం సాధ్యం కాదు.
అదనపు చార్జీలు
చెక్ అవుట్ సమయంలో వినియోగదారుడికి తెలియకుండా ఇన్సూరెన్స్ లేదా ఇతర అనవసరమైన యాడ్ ఆన్స్ ను డిఫాల్ట్ గా జోడించకూడదు. అనవసరమైన చార్జీలు వేసి కస్టమర్ల జేబులను గుల్ల చేయకూడదు.
ఫిర్యాదుల పరిష్కారం
కస్టమర్ కేర్ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్ తో అనుసంధానించాలి. దీనివల్ల కస్టమర్ల సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయి.
ఉత్పత్తి సమాచారం
వారంటీ లేదా రిటర్న్ పాలసీ. ఎక్స్పైరీ డేట్స్.. ఇంపోర్టెడ్ ఉత్పత్తుల వివరాలను కచ్చితంగా పేర్కొనాలి. లేనిపక్షంలో ఆ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకు రాకూడదు. విక్రయించకూడదు.
బండిల్ ఫీజుల మీద నియంత్రణ
మెంబర్షిప్ లేని సామాన్య వినియోగదారులపై అనవసరమైన అదనపు సర్వీస్ ఛార్జీలను విధించకూడదు.. ఈ కామర్స్ సంస్థలు బండిల్ ఫీజులను విపరీతంగా విధిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా దీని మీదనే ఫిర్యాదు వచ్చింది.
డేటా ప్రైవసీ
కస్టమర్ల వ్యక్తిగత డేటాను వారి అనుమతి లేకుండా పంచుకోకూడదు. అలాగే వేరే సంస్థలకు విక్రయించకూడదు. ఆ సమాచారాన్ని భద్రపరచడంలో గోప్యత పాటించాలి. ఈ కొత్త నియమాలు ఆన్లైన్ షాపింగ్ ను మరింత సురక్షితంగా.. పారదర్శకంగా మార్చేందుకు దోహదపడతాయి.
ఈ కామర్స్ సంస్థలు భారీగా వ్యాపారం చేస్తున్నప్పటికీ.. కనీస ప్రమాణాలను పాటించడంలో విఫలమవుతున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఓ ప్రముఖ సంస్థకు సంబంధించిన వేర్ హౌస్ ను తనిఖీ చేసినప్పుడు అందులో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగు చూశాయి.. అందువల్లే ఈ నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.