Amazon : కొత్త ఇంటికి సామాన్లు కొనాలని చూస్తున్నారా.. అలాంటి వాళ్లకు శుభవార్త. అద్భుతమైన డీల్స్, ఎట్రాక్టికవ్ ఆఫర్‌లతో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభమైంది. సేల్‌లో ఉత్పత్తులపై లభించే డిస్కౌంట్ల గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ప్రొడక్టులపై లభించే తగ్గింపులతో పాటు, సేల్ సమయంలో ఎక్స్ ట్రా తగ్గింపు ఎలా పొందవచ్చో వివరంగా తెలుసుకుందాం.
Also Read: ఓలా, ఏథర్‌కు ఇక కష్టాలు మొదలు.. బజాజ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది!
ఎక్స్ ట్రా తగ్గింపు ఎలా పొందాలి?
అమెజాన్ ఈ సేల్ కోసం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుతో చేతులు కలిపింది. దీని అర్థం ఏమిటంటే.. గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో షాపింగ్ చేస్తున్నప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌తో చెల్లిస్తే మీరు 10 శాతం (రూ.1750 వరకు) ఎక్స్ ట్రా తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ క్రెడిట్ కార్డ్ నాన్-ఈఎంఐ, క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్లలపై అందుబాటులో ఉంది. అంతేకాకుండా, మీ బిల్లు మొత్తం రూ.24,990 కంటే ఎక్కువ ఉంటే అదనంగా రూ. 1500 వరకు బోనస్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మీ వద్ద హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ లేకపోతే, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ దగ్గర అడిగి దాంతో డబ్బులను ఆదా చేసుకోవచ్చు.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ముగింపు
మే 1 నుండి ప్రారంభమైన అమెజాన్ సేల్ ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలుసా.. అయితే అమెజాన్‌లోని ఏ బ్యానర్‌పై కూడా సేల్ ముగింపు తేదీని పేర్కొనలేదు. కానీ బ్యాంక్ ఆఫర్ పేజీలో ఇచ్చిన సమాచారం ప్రకారం.. మే 1 నుండి ప్రారంభమైన సేల్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆఫర్ మే 6 రాత్రి 11:59 వరకు అందుబాటులో ఉంటుంది. దీనిని బట్టి ఈ సేల్ మే 6 వరకు కొనసాగే అవకాశం ఉంది.
డిస్కౌంట్‌లతో పాటు ఇతర ఆఫర్లు
ఉత్పత్తులపై డిస్కౌంట్‌లతో పాటు ఎక్స్ ట్రా డబ్బులను కూడా ఆదా చేయాలనుకుంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. మీ పాత ప్రొడక్ట్ తిరిగి ఇచ్చి కొత్త ప్రొడక్ట్ పై ఎక్స్ ట్రా డిస్కౌంట్ పొందవచ్చు.
Also Read: ఇన్నోవాకు ఇక కష్టకాలం మొదలు.. కియా క్లావిస్‌తో మార్కెట్ షేక్!