Inspector Zende: ఇండియాలో ఉన్న అతి కొద్ది మంది మంచి నటుల్లో మనోజ్ బాజ్పాయ్ ఒకరు. ఆయన నటించిన చాలా సినిమాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించూకున్నాయి. విలక్షణమైన నటుడిగా తనకంటూ ఒక వైవిధ్యమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ నటుడు తను చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక తెలుగులో సైతం పలు సినిమాల్లో నటించిన ఆయన ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తూ ఉంటాడు…ఇక ప్రస్తుతం ‘ ఇన్స్పెక్టర్ జెండే’ అనే సినిమాతో మరోసారి ఓటిటి లో సందడి చేయడానికి రెడీ అయ్యాడు. ఈనెల 5వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి రాబోతుందనే ఉద్దేశ్యంతో మనోజ్ బాజ్ పాయ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లో పాల్గొన్నప్పుడు ఆయన సినిమా గురించి చాలా బాగా డిస్కస్ చేశాడు. అదేంటి అంటే ఈ సినిమా స్క్రిప్టు చదివినంత సేపు తను చాలా బాగా నవ్వుకున్నానని మొత్తానికైతే ఈ సినిమాతో ఒక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాను అనే కాన్ఫిడెంట్ ను ఆయన వ్యక్తం చేశాడు…
Also Read: అసలు ఎవరు ఈ ఒమీ..ఓజాస్ గంభీర కంటే పవర్ ఫుల్ నా..? బ్యాక్ స్టోరీ చూస్తే మెంటలెక్కిపోతారు!
ఇక ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న డైరెక్టర్ ఓం రావత్ సైతం ఈ సినిమా కోసం కొంతమంది ముంబై పోలీసుల్ని సంప్రదించమని వాళ్లు ఈ సినిమాలో నటిస్తే చాలా రియలిస్టిక్ గా ఉంటుందని అడిగామని అయినప్పటికి వాళ్ళు చాలా బిజీగా ఉన్నామని చెప్పడంతో ముంబై పోలీసులు చాలా బాగా వర్క్ చేస్తున్నారు అంటూ ఆయన చెప్పడం విశేషం…
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో చాలా సీరియస్ సన్నివేశాలను చాలా కామెడీగా చూపిస్తూ సినిమాని ఒక ఇంటెన్స్ తో తీశామని మనోజ్ బాజ్ పాయ్ చెప్పడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గురించి చాలా డిఫరెంట్ కోణంలో చూపించామని వాళ్లు ఎలాంటి ఆక్టివిటీస్ చేస్తారు.
వాళ్ళని పట్టుకోడానికి పోలీసులు ఎలా ప్రయత్నం చేస్తారు అనేది కూడా ఇందులో చాలా క్షుణ్ణంగా చూపించే ప్రయత్నం చేశామని వాళ్ళు చెబుతుండటం విశేషం…ఇక ఈ సినిమా డైరెక్ట్ ఓటిటి కి వస్తుండటంతో ఈ సినిమాను చూసి సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు…