Inspector Jende Netflix Web Series : చార్లెస్ శోభరాజ్ గురించి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇతడు ప్రసిద్ధమైన హంతకుడిగా పేరుపొందాడు. ఇతడి గురించి ఏకంగా ఇంటర్ పోల్ రంగంలోకి దిగి.. అనేక సంవత్సరాల తర్వాత పట్టుకుంది. చార్లెస్ శోభరాజ్ గురించి.. అతడు చేసిన నేరాల గురించి ఇప్పటికి కథలు కథలుగా చెప్పుకుంటారు. అతడి జీవిత చరిత్రపై అనేక సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలలో కొంత నాటకీయత కూడా ఉంది. చార్లెస్ శోభరాజ్ పై ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఇంకా అతడిలో ఏదో కొత్తకోణం ఉందని దర్శకులు చెబుతూనే ఉన్నారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ మనోజ్ బాజ్ పాయ్, జిమ్ సర్భా ప్రధాన పాత్రల్లో ఇన్స్పెక్టర్ జెండే అనే చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం నుంచి ఇది స్ట్రీమ్ అవుతోంది.
చార్లెస్ శోభరాజ్ 1944లో సైగాన్ ప్రాంతంలో భారతీయ తండ్రి.. వియత్నాం తల్లికి జన్మించాడు. ఆసియా, యూరప్ ప్రాంతాలలో అత్యంత క్రూరమైన నేరాలకు పాల్పడ్డాడు. 1970లో అతడు హిప్పీగా మారిపోయాడు. యువ బ్యాక్ ప్యాకర్లను లక్ష్యంగా చేసుకొని.. వారిపై విష ప్రయోగం చేసి.. దోచుకునేవాడు. ఇతడి బాధితులు ఎక్కువగా పర్యాటకులు ఉండేవారు. అందువల్లే అతడు అంతర్జాతీయంగా అపఖ్యాతి ఎదుర్కొన్నాడు.. చార్లెస్ శోభరాజ్ గురించి పుస్తకాలు.. సినిమాలు.. ధారావాహికలు అనేకం వచ్చాయి.. అయినప్పటికీ అతనిలో తెలియని కోణం మరొకటి ఉంది. ఆ కోణాలను స్పృశిస్తూ అనేక సినిమాలు వచ్చాయి.
ఇన్స్పెక్టర్ జెండే: నెట్ ఫ్లిక్స్
చిన్మయి మాండ్లేకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇది గత శుక్రవారం నుంచి స్ట్రీమ్ అవుతోంది. మనోజ్ బాజ్ పాయ్ ఇన్స్పెక్టర్ మధుకర్ బాబురావు జెండే గా ప్రధాన పాత్రలో నటించాడు. జిమ్ సర్బ్ చార్లెస్ శోభరాజ్ పాత్ర నుంచి ప్రేరణ పొందిన కార్ల్ భోజ్ రాజ్ పాత్రలో నటించాడు. చిత్రాన్ని నార్తర్న్ లైట్స్ ఫిలిమ్స్ నిర్మించింది.
బ్లాక్ వారెంట్; నెట్ ఫ్లిక్స్
ఈ క్రైమ్ డ్రామా 2019లో విడుదలైంది. సునీల్ గుప్తా, నేత్ర చౌదరి రాసిన బ్లాక్ వారెంట్: కన్ పెషన్స్ ఏ తీహార్ జైలర్ అనే పుస్తకంలో కీలక అంశాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అనేక నేరాలు చేసి జైలు పాలైన శోభరాజ్.. జైలు నుంచి ఎలా బయట పడగలిగాడు.. తర్వాత ఏం జరిగింది.. ఈ ప్రశ్నల ఆధారంగానే ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమాలో ఆద్యంతం నాటకీయత కనిపిస్తుంది.
మై ఔర్ చార్లెస్: జియో హాట్ స్టార్
ప్రవాల్ రామన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణదీప్ హుడా కీలకపాత్రలో నటించాడు. చార్లెస్ శోభ రాజ్ బయోపిక్ కాకుండా.. 1986లో ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి చార్లెస్ శోభ రాజు తప్పించుకున్న విధానాన్ని.. ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఈ సినిమా ద్వారా చూపించారు.
ది సర్పెంట్: నెట్ ఫ్లిక్స్
ఇది బిబిసి, నెట్ ఫ్లిక్స్ ఆధ్వర్యంలో నిర్మితమైంది. శోభ రాజ్ నేరాలను.. చేసిన దారుణాలను .. దానికి దారి తీసిన పరిస్థితులను చూపించారు. చార్లెస్ పాత్రను తహర్ రహీం పోషించాడు. జెన్నా కోల్ మన్ చార్లెస్ చార్లెస్ శోభ రాజ్ భాగస్వామి మేరీ ఆండ్రి లెక్లర్క్ పాత్రలో నటించింది. ఈ సిరీస్ చివరి వరకు ఉత్కంఠ గా సాగుతుంది. 1970లో ఆగ్నేయ ఆసియా ప్రాంతంలోకి తీసుకెళ్తుంది.
ది రియల్ సర్పెంట్: ఆపిల్ టీవీ
కల్పన కంటే వాస్తవాలను ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ డాక్యుమెంటరీ నచ్చుతుంది. ఇది చార్లెస్ శోభరాజ్ గురించి.. అతడు నేరాలలో ప్రవేశించిన విధానం గురించి అత్యంత పరిశోధనాత్మకంగా ఉంటుంది. చార్లెస్ బాధితులు.. పాత్రికేయులు.. ఇతర వ్యక్తులు అందించిన వివరాల ఆధారంగా ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. సంవత్సరాలు తరబడి తనను ఎవరూ గుర్తించకుండా చార్లెస్ శోభరాజ్ ఎలా వ్యవహరించాడు.. తనను తాను ఎలా కాపాడుకున్నాడు.. అనే విషయాలు ఇందులో ఉన్నాయి.