Homeఆంధ్రప్రదేశ్‌YSRCP Leadership Issues In Uttarandhra: ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్ద కష్టం!

YSRCP Leadership Issues In Uttarandhra: ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్ద కష్టం!

YSRCP Leadership Issues In Uttarandhra: రాష్ట్రంలో కాంగ్రెస్( Congress) పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు రాజశేఖర్ రెడ్డి. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది నేతలు ఉన్నారు. అందులో రాజశేఖర్ రెడ్డి ఒకరు. పార్టీలో సైతం చాలా పదవులు చేపట్టారు. అయితే తెలుగుదేశం పార్టీ ప్రాబల్యం పెరుగుతున్న క్రమంలో.. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలన్న కసి నాయకుల్లో ఉండేది. దానిని గుర్తించారు రాజశేఖర్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి చురుకైన నాయకులను గుర్తించారు. అలా పుట్టుకొచ్చిన వారే ఒక బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, కొణతాల రామకృష్ణ వంటి నేతలు. అయితే కార్యక్రమంలో ఎటువంటి నేతలంతా జగన్మోహన్ రెడ్డి కొడుకు కిందకు చేరారు. కానీ వారిని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి.

Also Read: లోకేష్ కు అలా అవకాశం ఇచ్చిన చంద్రబాబు!

* క్లిష్ట పరిస్థితుల్లో వైసిపి..
ప్రస్తుతం ఉత్తరాంధ్రలో( North Andhra ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పార్టీని నడిపే నాయకుడు కూడా లేరు. బొత్స సత్యనారాయణ లాంటి బీసీ నేత జగన్మోహన్ రెడ్డికి ఒక రక్షణ వలయంగా నిలిచారు. అయితే దానిని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇచ్చారు. మండలిలో వైసీపీ పక్ష నేతగా కూడా ఛాన్స్ కల్పించారు. తనకున్న పాత పరిచయాల ద్వారా ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు బొత్స. అయితే ఈ క్రమంలో బొత్స అనారోగ్యానికి గురికావడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్. ఆ స్థాయిలో ఇప్పుడు ఎవరు పనిచేస్తారు అనేది ఒక ప్రశ్న. రకరకాల పేర్లు తెరపైకి వచ్చినా.. బొత్స స్థాయిలో ప్రభావం చూపే నేతల మాత్రం ఎంత మాత్రం లేరని చెప్పవచ్చు.

* పెద్దదిక్కుగా ధర్మాన..
ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పెద్దదిక్కుగా ఉన్నారు ధర్మాన ప్రసాదరావు( dharmana Prasad Rao) . సుదీర్ఘకాలం ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రిగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో ఓ సాధారణ సర్పంచ్ చేతిలో ఓడిపోయారు. అది కూడా దారుణంగా 52 వేల ఓట్ల తేడాతో. ఆయన గెలిచినప్పుడు మాత్రం చాలా తక్కువ మెజారిటీతో బయటపడుతున్నారు. పైగా మునుపటి మాదిరిగా ధర్మాన దూకుడుగా వ్యవహరించలేకపోతున్నారు. ఆయన కేవలం శ్రీకాకుళం జిల్లా నేత మాత్రమే. ఉత్తరాంధ్ర పై ప్రభావం చూపేటంత శక్తి, బలం లేదన్నది ఒక బహిరంగ రహస్యం. ఆయన తమ్ముడు కృష్ణ దాస్ పరిస్థితి కూడా అంతే. పోనీ తమ్మినేని సీతారాం ద్వారా ప్రయత్నాలు చేద్దాము అంటే ఆయన వాగ్దాటి వరకే పరిమితం. కేవలం శ్రీకాకుళం జిల్లా వరకే ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. డాక్టర్ సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్ వంటి నేతలు ఉన్న ఎంత మాత్రం ప్రభావం చూపలేరు. అయితే ఇప్పుడు బొత్స కు అనారోగ్యం కావడంతో ఏదో ఒక నాయకుడికి ఇప్పుడు బొట్టు పెట్టాల్సిందే. లేకుంటే మాత్రం ఉత్తరాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలపడే అవకాశాలు సన్నగిల్లుతాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular