spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu Lokesh Strategy: లోకేష్ కు అలా అవకాశం ఇచ్చిన చంద్రబాబు!

Chandrababu Naidu Lokesh Strategy: లోకేష్ కు అలా అవకాశం ఇచ్చిన చంద్రబాబు!

Chandrababu Naidu Lokesh Strategy: ఏపీలో( Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా టీటీడీ లడ్డుకు సంబంధించిన నెయ్యి కల్తీ వ్యవహారం అధికార, విపక్షం మధ్య గట్టి దుమారం రేపుతోంది. శాసనసభలో కేవలం కూటమి ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. శాసనమండలిలో మాత్రం కూటమి ఎమ్మెల్సీలతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. ఎందుకంటే శాసనమండలిలో కూటమికంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ఎక్కువ. శాసనమండలిలో గట్టి మంటలే రేగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తోంది. అయితే అక్కడ ఒకే ఒక్కడుగా నారా లోకేష్ నిలుస్తుండడం విశేషం.

Also Read: ఖమేనీ ఖతం.. ఇజ్రాయెల్, అమెరికా ఇకనైనా యుద్ధం ముగిస్తాయా?

* శాసనమండలి వైపు చూడని బాబు
సాధారణంగా సీఎం చంద్రబాబు( CM Chandrababu) ఉభయసభల్లో పాల్గొనడం ఆనవాయితీ. కానీ ఎందుకో ఈసారి శాసనమండలి వైపు సీఎం చంద్రబాబు చూడడం లేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం నుంచి శాసనమండలిలో మంత్రి లోకేష్ ఎక్కువగా కనిపిస్తున్నారు. కనీసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అటువైపుగా చూడడం లేదు. ఒకరిద్దరు మంత్రులు కూడా హాజరవుతున్నారు. కానీ వైసీపీ ఎమ్మెల్సీలకు చుక్కలు చూపిస్తున్నారు నారా లోకేష్. శాసనమండలిలో వైసిపి పక్ష నేతగా ఉన్న బొత్సతో ఢీ అంటే ఢీ అంటున్నారు లోకేష్. మాజీ మంత్రి అంబటి రాంబాబు ను అరెస్టు చేయడాన్ని లోకేష్ సమర్థించుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీల నోటికి తాళం పడేలా గట్టిగానే ఫైర్ అయ్యారు నారా లోకేష్. శాసనమండలిని లోకేష్ కు విడిచిపెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు అర్థమవుతోంది.

* ప్రూవ్ చేసుకున్న లోకేష్..
ఈనెల 7 వరకు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు( assembly sessions ) జరగనున్నాయి. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కావడంతో సుదీర్ఘంగా సాగాయి. అయితే శాసనమండలిలో ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని భావించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తమకున్న సంఖ్యా బలం ఒక వైపు.. శాసనమండలి చైర్మన్ మరోవైపు.. బొత్స సీనియారిటీ మరోవైపు.. ఇలా ముప్పేట కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టవచ్చని అంచనా వేసింది. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ లోకేష్ ధీటుగానే ఎదుర్కొన్నారు. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చిక్కుల్లో పడేశారు. శాసనమండలిపై లోకేష్ కు సమగ్ర అవగాహన ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీగా సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. అక్కడ ఉన్న పరిస్థితులను ఆకలింపు చేసుకున్నారు. అయితే చంద్రబాబుతో పాటు పవన్ మాత్రం.. శాసనమండలి విషయంలో లోకేష్ కు విడిచిపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో నారా లోకేష్ తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నట్లు అయ్యింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Oktelugu Epaper