Homeఆంధ్రప్రదేశ్‌TDP Social Media Strategy: వైసీపీకి టిడిపి ఫేస్ బుక్ షాక్!

TDP Social Media Strategy: వైసీపీకి టిడిపి ఫేస్ బుక్ షాక్!

TDP Social Media Strategy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అధికారిక ఫేస్బుక్ ఖాతాను మెటా నిలిపివేసింది. తెలుగుదేశం పార్టీ నుంచి వందలాది ఫిర్యాదులు వెళ్లడం, చట్టపరంగా అభ్యంతరాలు వెళ్లడంతో మెటా అధికారికంగా 12 లక్షల ఖాతాలు ఉన్న వైసిపి అధికారిక ఫేస్బుక్ ఖాతాను నిలిపివేయడం విశేషం. ఇది ఒక రకంగా షాకింగ్ పరిణామమే. ఇప్పటివరకు హ్యాకింగ్ మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు ఒక పార్టీ అధికారిక ఫేస్బుక్ అకౌంట్ ను.. […]

TDP Social Media Strategy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అధికారిక ఫేస్బుక్ ఖాతాను మెటా నిలిపివేసింది. తెలుగుదేశం పార్టీ నుంచి వందలాది ఫిర్యాదులు వెళ్లడం, చట్టపరంగా అభ్యంతరాలు వెళ్లడంతో మెటా అధికారికంగా 12 లక్షల ఖాతాలు ఉన్న వైసిపి అధికారిక ఫేస్బుక్ ఖాతాను నిలిపివేయడం విశేషం. ఇది ఒక రకంగా షాకింగ్ పరిణామమే. ఇప్పటివరకు హ్యాకింగ్ మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు ఒక పార్టీ అధికారిక ఫేస్బుక్ అకౌంట్ ను.. విపరీతమైన ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ ను మెటా బ్లాక్ చేయడం సంచలనంగా మారింది. ఈ విషయంలో తెలుగుదేశం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తమ చేతికి మట్టి అంటకుండా.. ఒక ప్రత్యేక ప్రణాళికతో ఈ తతంగాన్ని ముగించింది.

అశ్లీలత కంటెంట్ పై..
సాధారణంగా కంటెంట్ లో హింస, అశ్లీలత ఉంటే.. కచ్చితంగా మెటా గుర్తిస్తుంది. ఆపై అభ్యంతరాలతో పాటు చట్టపరమైన హెచ్చరికలు వస్తే నిలిపివేస్తుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ అకౌంట్ విషయంలో అలానే ఫిర్యాదులు రావడంతో స్పందించి నిలిపివేసింది. అయితే ఈ విషయంలో టిడిపి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లినట్లు అర్థం అవుతోంది. తమ చేతికి మట్టి అంటకుండా.. అనుమానిత, అభ్యంతరకర, అశ్లీలత పోస్టుల విషయంపై పోలీస్ శాఖకు ఫిర్యాదులు చేయడం.. అదే పోలీస్ శాఖ నుంచి మెటాకు సమాచారం వెళ్లడం, దర్యాప్తులో భాగంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ అకౌంట్ నిలిచిపోయింది. దాదాపు 12 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఫేస్బుక్ అకౌంట్ నిలిచిపోవడం అంటే చిన్న విషయం కాదు.

సోషల్ మీడియాలో ప్రచారం..
అశ్లీలత కంటెంట్ తో వైయస్సార్ కాంగ్రెస్ ఫేస్బుక్ అకౌంట్ నిలిచిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. సాధారణంగా రాజకీయ పార్టీలు ఫేస్బుక్ అకౌంట్లు కొనసాగించడం ఆనవాయితీ. అయితే రాజకీయంగా ప్రత్యర్థ్ది పార్టీలను టార్గెట్ చేసుకునేందుకు ఫేస్బుక్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో అక్కడ అశ్లీలతను హెచ్చరిస్తూ చాలామంది ఫిర్యాదులు చేశారు. వందలాదిమంది ఒకేసారి ఫిర్యాదు చేయడం, పోలీసుల ప్రమేయంతో మెటా వైయస్సార్ కాంగ్రెస్ ఫేస్బుక్ అకౌంట్ ను పరిశీలించగా అభ్యంతరకర పోస్టులు కనిపించాయి. వెంటనే ఆ ఖాతాను నిలిపివేసింది మెటా. ఇది ఒక విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ అంశమే. దానిని కక్కలేక మింగలేక.. ఫేస్బుక్ అకౌంట్ ను బతికించే ప్రయత్నంలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper