Asaduddin Owaisi: ఏపీ రాజకీయాలలో సరికొత్త పరిణామం మొదలైంది. ఒకవైపు కూటమిని ఎదుర్కొంటు.. పురపాలక ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని వైసిపి అధినేత జగన్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో ఎంఐఎం శిరోభారాన్ని కలిగిస్తోంది.
ఎన్నో సంవత్సరాలుగా మైనార్టీ ఓట్లే తమకు తిరుగులేని బలమని జగన్ నమ్ముతూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఆ వర్గం ఓట్లను చీల్చడానికి ఓవైసీ పక్క వ్యూహంతో రంగంలోకి దిగుతున్నారు. ఇది కాస్త రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తోంది.. సాధారణంగా ఏపీ రాజకీయాలలో ఎంఐఎం పాత్ర నామమాత్రమని అంతా అనుకుంటారు.. కానీ ఈసారి వ్యూహాత్మకంగా ఓవైసీ అడుగులు వేశారు. అన్ని సీట్లలో కాకుండా.. పట్టు ఉన్నచోట.. గెలిచే అవకాశం ఉన్నచోట.. కచ్చితంగా పోటీ చేయాలని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వయసుకు కుటుంబానికి దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న కడప కార్పొరేషన్ మేయర్ పీఠంపై ఓవైసీ కన్ను వేశారు. కడప మేయర్ పదవితో పాటు.. విజయవాడ నగరంలోని కీలకమైన డివిజన్లు.. హిందూపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ స్థానం.. ఆదోని.. రాయదుర్గం.. నంద్యాల.. పెనుగొండ వంటి ప్రాంతాలలో ఎంఐఎం తరఫున అభ్యర్థులను రంగంలోకి దించారు. ఏకంగా 21 స్థానాలలో ఎంఐఎం తరఫున అభ్యర్థులు పోటీ చేస్తూ ఉండడం విశేషం. ఇది కాస్త వైసీపీ క్యాంపులో ఆందోళన కలగజేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి స్వయంగా ఎంఐఎం నేతలు హైదరాబాద్ నుంచి రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్ మిరాజ్.. మహమ్మద్ ముబీన్.. మజీద్ హుస్సేన్.. ఎమ్మెల్సీ రియాజ్ ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎంఐఎం అనేది ఒక ప్రాంతీయ పార్టీ.. కాకపోతే ఉత్తర ప్రదేశ్ నుంచి మొదలు పెడితే బీహార్ వరకు ఇది పోటీ చేస్తోంది. ఈసారి తెలంగాణకు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది కూడా స్థానిక ఎన్నికల్లో వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇది నిజంగానే జగన్మోహన్ రెడ్డికి రక్తపోటుని పెంచుతుంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనంతరం పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ.. క్షేత్రస్థాయిలో స్థానిక ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న జగన్ కు ఈ పరిణామం ఒక రకంగా ఇబ్బందిగా మారింది. తన వెంటే మైనారిటీలు ఎప్పుడూ ఉంటారని జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తుంటారు. అయితే ఎంఐఎం పార్టీ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో పాగా వేయాలని చూస్తోంది. ఇది కాస్త జగన్ కు మింగుడు పడడం లేదు. ముఖ్యంగా కడప గడ్డమీద మేయర్ బరిలో నిలవడం.. ముస్లిం ఓట్లలో చీలిక వస్తే అది ప్రత్యర్థులకు ప్లస్ అవుతోందని ఆందోళన జగన్ కు కంటిమీద కులుకు లేకుండా చేస్తుంది. మొత్తానికి ఏపీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎంఐఎం ప్రవేశం కేవలం కొన్ని స్థానాలకే పరిమితం కాకుండా.. వచ్చే రోజుల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ పై గట్టి ప్రభావం చూపించేలా కనిపిస్తోంది..