Homeఆంధ్రప్రదేశ్‌YSRCP Analysts: వైసిపి అనుకూల విశ్లేషకుల యూటర్న్.. మనీ మేటర్

YSRCP Analysts: వైసిపి అనుకూల విశ్లేషకుల యూటర్న్.. మనీ మేటర్

YSRCP Analysts: సమకాలీన రాజకీయ అంశాలపై చాలామంది విశ్లేషిస్తుంటారు. రాజకీయ పార్టీల తప్పు ఒప్పులను ఎత్తిచూపుతుంటారు. ప్రభుత్వ వైఫల్యాలను, గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటారు. అయితే గతంలో పత్రికలు, టీవీ డిబేట్లో మాత్రమే ఈ విశ్లేషణలు కనిపించేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పుణ్యమా అని ఎవరికి వారే స్వతంత్రంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మరీ విశ్లేషిస్తుంటారు. ప్రధాన మీడియా కంటే యూట్యూబ్ చానల్స్ లో విశ్లేషణలకే ప్రజలు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కేవలం ఈ ఒక్క […]

YSRCP Analysts: సమకాలీన రాజకీయ అంశాలపై చాలామంది విశ్లేషిస్తుంటారు. రాజకీయ పార్టీల తప్పు ఒప్పులను ఎత్తిచూపుతుంటారు. ప్రభుత్వ వైఫల్యాలను, గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటారు. అయితే గతంలో పత్రికలు, టీవీ డిబేట్లో మాత్రమే ఈ విశ్లేషణలు కనిపించేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పుణ్యమా అని ఎవరికి వారే స్వతంత్రంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మరీ విశ్లేషిస్తుంటారు. ప్రధాన మీడియా కంటే యూట్యూబ్ చానల్స్ లో విశ్లేషణలకే ప్రజలు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కేవలం ఈ ఒక్క కారణంతోనే రాజకీయ పార్టీలు విశ్లేషకులకు ప్యాకేజీల రూపంలో కొంత మొత్తం అందిస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. తద్వారా ఆ రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు అనుకూల విశ్లేషణలు వస్తున్నాయి. ప్రత్యర్థులపై వ్యతిరేక విశ్లేషణలు చేస్తున్నారు. ఈ విశ్లేషణలు ప్రజల్లోకి బలంగా వీలుతుండడంతో రోజురోజుకు యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ విశ్లేషణలు బట్టి ఫలానా రాజకీయ పార్టీకి అనుకూలం అని ఇట్టే చెప్పవచ్చు.

* చెల్లింపులు నిలిచిపోవడంతోనే?
అయితే ఏపీలో పేరు మోసిన విశ్లేషకులు, జర్నలిస్టులు ఎక్కువగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా విశ్లేషణలు చేస్తుంటారు. వారిలో ఫ్లేవర్ కనిపిస్తుంది. ఫేవర్ కూడా స్పష్టమౌతూ వస్తోంది. ప్రధాన మీడియాలో పనిచేసిన చాలా మంది జర్నలిస్టులు విశ్లేషకుల అవతారం ఎత్తారు. అటువంటి వారు చాలామంది వైసీపీకి అనుకూలంగా విశ్లేషిస్తుంటారు. కానీ గత కొంతకాలంగా ఈ విశ్లేషకులు యూ టర్న్ తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై నేరుగా వ్యతిరేకంగా మాట్లాడడం లేదు కానీ. వైఫల్యాలపై మాట్లాడడం ప్రారంభించారు. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో చెల్లింపులు లేకపోవడంతోనే వారు యూటర్న్ తీసుకున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

* సాక్షిని తపేల ఛానల్ తో పోల్చుతూ..
సాక్షితోపాటు యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఎక్కువగా కనిపిస్తారు కె ఎస్ ప్రసాద్, పాషా. అయితే ఇప్పుడు వారు సాక్షి ఛానల్ కు వెళ్లడం లేదు. ఇకనుంచి వెళ్ళమని కూడా తేల్చి చెప్పారు. కేఎస్ ప్రసాద్ అయితే సాక్షిని తపేల ఛానల్ తో పోల్చారు. అయితే వారు మాత్రమే కాదు చాలామంది వైసిపి అనుకూల విశ్లేషకులు తీరు మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలను తప్పుపడుతూ.. ప్రభుత్వం కొనసాగినప్పుడు జరిగిన వైఫల్యాలను బయట పెడుతున్నారు. అయితే వీరికి చెల్లింపుల విషయంలో జరిగిన బ్రేక్ కారణంగానే వీరంతా ఎదురు తిరిగినట్లు అర్థమవుతోంది. అయితే దాదాపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా విశ్లేషించే అందరూ.. వ్యతిరేకంగా మారడం చూస్తుంటే ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper