Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Capital City Merger: అమరావతిలో నగరాలు, పట్టణాలు విలీనం

Amaravati Capital City Merger: అమరావతిలో నగరాలు, పట్టణాలు విలీనం

Amaravati Capital City Merger: అమరావతికి( Amravati capital ) సంబంధించి ఈరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతిని ఏకైక రాజధానిగా తీర్మానిస్తూ కేంద్రానికి నివేదిక పంపనుంది రాష్ట్ర ప్రభుత్వం. 2014 రాష్ట్ర విభజన బిల్లును సవరిస్తూ.. అమరావతి ఏకైక రాజధాని అనే అంశాన్ని జతపరుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయనుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న గందరగోళానికి చెక్ చెప్పాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే కేవలం చట్టబద్ధత అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం మంచిదే అయినా.. పనిలో పనిగా అమరావతిని చిన్నపాటి మున్సిపాలిటీ గా కాకుండా సువిశాల నగరంగా చూపించే ప్రయత్నం చేయాలి. అమరావతిలో సమీప జిల్లాల్లోని ముఖ్య పట్టణాలను కలుపుతూ విలీన ప్రక్రియను సైతం చేపట్టాలి. అప్పుడే అమరావతి అనేది విశ్వ నగరంగా గుర్తింపు లోకి వచ్చే అవకాశం ఉంది. అమరావతికి ఇది అత్యంత అవసరం కూడా.

* చట్టబద్ధతతో పాటు..
గత అనుభవాల దృష్ట్యా అమరావతి విషయంలో మరోసారి ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి విషం చిమ్మ కూడదు, రాజధానిని మార్పు చేయకూడదు.. అని బలంగా కోరుకుంటున్నారు రైతులు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కావాల్సింది అదే. అందుకే అమరావతి రైతుల నుంచి సీఎం చంద్రబాబుకు( CM Chandrababu) ఇటువంటి డిమాండ్ వినిపించింది. అందుకే పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తే అమరావతిని ఇక కదిలించలేరని భావించి ఈ నిర్ణయానికి వచ్చారు. ఈరోజు రాష్ట్ర విభజన బిల్లును సవరించి అమరావతి ఏకైక రాజధాని అని చూపించే ప్రయత్నం చేయనున్నారు. అయితే పనిలో పనిగా అమరావతి నగరంలో ముఖ్య పట్టణాల విలీనాన్ని కూడా పూర్తి చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీంతో అమరావతి మరింత స్ట్రాంగ్ కానుంది.

* అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు..
దాదాపు నాలుగు జిల్లాల వరకు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయి.. అందులో ప్రధాన మున్సిపాలిటీలు, పట్టణాలు సైతం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 29 గ్రామాలతో అమరావతి ఒక మున్సిపాలిటీ మాదిరిగా ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి నగరంగా అమరావతిని చూపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు చట్టబద్ధత ప్రక్రియలోనే అమరావతిలో సమీప నగరాలతో పాటు పట్టణాల విలీన ప్రక్రియ పూర్తి చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. మరికొద్ది సమయంలో ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది. ఇదే వేదికపై అమరావతిలో నగరాలతో పాటు పట్టణాల విలీన ప్రక్రియ జరగాలన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం. అయితే ఏవేవో సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయి అన్న అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular